News

నేడు వారి అకౌంట్లలో రూ.15 వేలు జమ

KJ Staff
KJ Staff
kapu nestham
kapu nestham

ఏపీ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో పాటు కొత్త పథకాలను కూడా అమలు చేస్తోంది. పేదల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నూతన పథకాలు ప్రవేశపెడుతోంది. ఆటోలు, క్యాబ్, మ్యాక్సీ వాహనాలు నడుపుకునే వారికి ఏడాదికి రూ.10 వేలు ఇవ్వడంతో పాటు అమ్మఒడి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ఫించన్ ఇవ్వడం లాంటి పథకాలు కొత్తగా ప్రవేశపెట్టినవే. ఇలాంటి అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది.

అందులో భాగంగా వైఎస్సార్ కాపు నేస్తం పథకంను ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 3,27,244 మంది పేద మహిళలకు ఆర్ధిక సాయం అందించనునున్నారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటన్ బటన్ నొక్కి నగదును లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా జమ చేయనున్నారు. బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో నగదు జమ చేయాలని జగన్ సూచించారు.

గత ఏడాది ఒకసారి కాపు నేస్తం డబ్బులను జమ చేయగా.. రెండో ఏడాది వరుసగా డబ్బులను జమ చేస్తున్నారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల లోపు కాపు, బలిజ, తెలగ, ఒంటరి మహిళలకు ఏడాదికి రూ.15 వేలు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలు ఆర్ధిక సాయం ప్రభుత్వం అందించనుంది. గత ఏడాది ఈ పథకం కింద 3,27,349 మందికి రూ.491.02 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. నేడు 3,27,244 మందికి రూ.490.86 కోట్లతో కలిపి మొత్తం రూ.981.88 కోట్లు ఇవ్వనుంది.

వెనుకబడిన కులాల్లోని మహిళలను ఆర్ధికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. గత ఎన్నికల సమయంలో వైసీపీ మేనిఫెస్టోలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందుకు అనుగుణంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

Related Topics

Kapu nestham, Money, AP

Share your comments

Subscribe Magazine