News

పాన్ కార్డు - ఆధార్ తో లింకింగ్ కు 3 రోజులే గడువు !

Sriya Patnala
Sriya Patnala
link your Aadhar card and pan card before the deadline - June 30, Follow this!
link your Aadhar card and pan card before the deadline - June 30, Follow this!

జూన్ 30 వ తేదీ లోగ పాన్ నెంబర్ ను Aadhaar Number తో లింక్ చేయని పక్షం లో జులై 1 వ తారీకు నుండి మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు అని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఈ ప్రాసెస్ పూర్తి చేయడానికి వెయ్యి రూపాయల చలానా ప్రతి ఒక్కరు చెల్లించాల్సి ఉంటుంది.

(Income Tax law సెక్షన్ 139AA ప్రకారం పాన్ కార్డు కలిగిన ప్రతి పౌరుడు తమ పాన్ సమాచారాన్ని ఆధార్ తో జత చేయడం తప్పనిసరి. ఇలా చేయని పక్షంలో ఆదాయపు పన్ను శాఖ మీకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

మీరు ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌- పాన్ కార్డ్ లింక్ చేసుకోదానికి ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి

1) ముందుగా income tax department కి సంబందించిన e-filing పోర్టల్ లోకి లాగిన్ అవ్వండి. వెబ్సైటు లింక్ ని description బాక్స్ లో నుండి డైరెక్ట్ గ ఓపెన్ చేస్కోండి.

2) హోం పేజీలో ఎడమ వైపు "Link Aadhar" అనే ఆప్షన్‌ పై క్లిక్ చేయండి

3) ఇక్కడ ముందుగా పాన్ కార్డ్ నంబర్, తర్వాత మీ ఆధార్ నంబర్, ఆధార్ కార్డులో ఉన్న విధంగానే మీ పేరు, ఫోన్ నెంబర్ నమోదు చేయాలి.

-నమోదు చేసాక Continue by paying through epay tax అని ఉంటుంది దానిపై క్లిక్ చేయండి.
-మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది
-OTP ధృవీకరణ తర్వాత, మీరు e-Pay Tax పేజీకి మళ్లించబడతారు.
-ఆదాయపు పన్ను టైల్‌పై ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి.
-2023-24 సెలెక్ట్ చేసుకుంటే అప్డేట్ అవ్వట్లేదని కొందరు చెప్పడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు FY ని (2024-25) సెలెక్ట్ చేసి other reciepts (500) సెలెక్ట్ చేసుకొని కొనసాగించండి.
-ఇప్పుడు, చలాన్ జనరేట్ అవుతుంది. తదుపరి స్క్రీన్‌లో మీరు payment విధానం అంటే net banking, debit card , nsdl ఇలా ఎంచుకున్న తర్వాత ఆ బ్యాంకు సెలెక్ట్ చేసుకొని 1000 రూపాయల పేమెంట్ పూర్తి చేయాలి.
- ఇ-పే ట్యాక్స్ సర్వీస్ ద్వారా చెల్లింపు చేసినట్లయితే వెంటనే, ఒకవేళ (NSDL)లో చెల్లింపు చేసినట్లయితే, paymnet చేసిన 4-5 రోజుల తర్వాత, ఇ-ఫిల్లింగ్ పోర్టల్‌లో ఆధార్ పాన్ లింక్ అభ్యర్థనను సమర్పించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి

ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్! మరో 3 నెలల గడువు పెంపు.. సద్వినియోగం చేసుకోండి..



పేమెంట్ పూర్తి చేసిన తర్వాత మరో సారి లాగిన్ చేయాల్సి ఉంటుంది.

-ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీకి వెళ్లి, క్విక్ లింక్‌ల క్రింద లింక్ ఆధార్‌పై క్లిక్ చేయండి.
- పాన్ మరియు ఆధార్‌ను నమోదు చేసి, చెల్లుబాటుపై క్లిక్ చేయండి.
- అవసరమైన వివరాలను నమోదు చేసి, లింక్ ఆధార్‌పై క్లిక్ చేయండి.
-మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేశాఖ validate పై క్లిక్ చేయండి.
-ఇప్పుడు మీ రిక్వెస్ట్ సమర్పించబడుతుంది, ఇప్పుడు మీరు ఆధార్-పాన్ లింక్ స్థితిని అదే పోర్టల్ లో aadhar link status పై క్లిక్ చేసి చుస్కోవచ్చు.

చాలాన కట్టిన 48 గంటలలోగా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు తో లింక్ అవ్వడం జరుగుతుంది.

ఒకవేళ మీరు ఆధార్ తో జత చేసిన మీ ఫోన్ నెంబర్ వేరుగా ఉన్నా లేదా ఇంకేవైనా వివరాలు తప్పుగా ఉంటే ఈ process రిజెక్ట్ అవుతుంది, అలంటి సందర్భాల్లో దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లి ముందు వాటిని సరి చేసుకొని . ఆ తర్వాత ఈ ప్రక్రియను మరో సారి ప్రయత్నించండి.

ఇది కూడా చదవండి

ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్! మరో 3 నెలల గడువు పెంపు.. సద్వినియోగం చేసుకోండి..

Share your comments

Subscribe Magazine