News

MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర: సురేంద్రనగర్, గుజరాత్

KJ Staff
KJ Staff

ఇప్పటివరకు సినిమా యాక్టర్లకు, రాజకీయ నాయకులకు అవార్డులు ఇవ్వడం మన చూసాం. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా దేశానికి అన్నం పెట్టె రైతులకు అవార్డులతో సత్కరించే మహత్తర కార్యక్రమాన్ని కృషి జాగరణ్ ప్రారంభించింది. కృషి జాగరణ్ వ్యవస్థాపకులు ఎం.సి.డొమినిక్ ప్రారంభించిన ఈ కార్యక్రమం అందరికి ఆదర్శవంతంగా నిలుస్తుంది. రైతులకు గుర్తింపు కల్పించి వారిని గొప్పతనాన్ని లోకానికి చాటిచెప్పే చొరవవ కృషి జాగరణ్ అందిపుచ్చుకుంది. ఈ అవార్డుల గురించి భారత దేశం నలుమూలలకు విస్తరించడానికి కృషి జాగరణ్ MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర మొదలుపెట్టింది. ఈ యాత్ర రథం భారత దేశంలోని అన్ని గ్రామాలకు వెళ్లి అక్కడి రైతు సోదరులను మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డుల గురించి జాగృతం చేస్తుంది.

రైతే దేశానికి వెన్నుముకగా పరిగణిస్తారు. కానీ సేద్యం ద్వారా కొన్ని కోట్ల మంది జనం కడుపు నింపే రైతుకు మాత్రం ఎటువంటి గుర్తింపు లేదు. వ్యవసాయాన్ని, రైతులను చిన్న చూపు చూసే ఈ రోజుల్లో కూడా, ఎంతో మంది రైతులు వ్యవసాయాన్ని వీడక సేద్యాన్ని నిలబెడుతున్నారు. అంతేకాకుండా చాల మంది రైతులు వ్యవసాయం ద్వారా లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. అటువంటి రైతులు ఎంతోమందికి ఆదర్శం. వారి గురించి అందరికి తెలిసి, గుర్తింపు ఏర్పర్చడానికి మొదలు పెట్టినవే ఈ MFOI అవార్డులు.

గత 27 సంవత్సరాలుగా కృషి జాగరణ్ రైతుల అభ్యున్నతి కోసం ఎన్నో ప్రత్యేకమైన కార్యాక్రమాలను మొదలుపెట్టింది. వాటిలో ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమం ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డుల ప్రధానోత్సవం. వ్యవసాయ రంగంలో విశేషమైన కృషి చేసి లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్న రైతులను ఈ MFOI అవార్డుతో సత్కరిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన MFOI VVIF యాత్ర రధం భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు సంచరిస్తూ రైతులకు MFOI పురస్కారాల విశిష్టతను తెలియపరుస్తారు. MFOI అవార్డులను పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల రైతులంతా అర్హులే, కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మాత్రం 10 లక్షలకు మించి ఉంటేనే ఈ అవార్డు లభిస్తుంది.

MFOI VVIF కిసాన్ భరత్ రధం, మధ్య ప్రదేశ్ లోని ఝాన్సీలో మొదలై, మధ్య మరియు పశ్చిమ భారత రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో ఈ రోజు సురేంద్రనగర్, గుజరాత్ లోని రైతు సోదరులని పలకరించడం జరిగింది. గత కొంత కాలంగా నిరంతరాయంగా కొనసాగుతున్న భరత్ యాత్రకు మహీంద్రా ట్రాక్టర్స్ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర లో భాగంగా మహీంద్రా కంపెనీ అనేక వ్యవసాయ అవసరాల కోసం రూపొందించిన మహీంద్రా యావో ట్రాక్టర్ను నేరుగా రైతుల వద్దకే తీసుకువెళ్లి ట్రాక్టర్ పనితీరుపై అవగాహనా కల్పిస్తారు. రైతులు ఈ ట్రాక్టర్ల పనితీరు స్వయంగా చూసి నచ్చితే కంపెనీ నుండి నేరుగా కొనుగోలు చెయ్యవచ్చు.

ఈ రోజు యాత్రలో, గుజరాత్ లోని సురేంద్రనగర్ గ్రామంలోని రైతులతో సమావేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ సమావేశానికి ఆ గ్రామంలోని ఎంతో మంది ఔత్సహికులైన రైతులు హాజరయ్యారు. కృషి జాగరణ్ ప్రతినిధి హర్ష భాయ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమినికి హాజరైన రైతు సోదరులతో సంభాషించి వారికి మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ గురించి తెలియపరిచారు. ఇప్పటివరకు ఈ యాత్ర కొనసాగుతున్న అన్ని ప్రాంతాల్లో రైతుల నుండి విశేషమైన స్పందన లభించింది. ఈ కార్యక్రమం నిర్వహించిన అన్ని ప్రాంతాల్లో గొప్ప జనాధారణ లభించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. నేడు గుజరాత్ లో ఈ కార్యకర్మం నిర్వహించడానికి హ్మిర్శిన రఘుబా పార్మర్ అనే రైతు సోదరుడు సహాయసహకారాలు అందించారు. ఆ గ్రామంలోని రైతులు ఈ కార్యక్రమానికి హాజరై ఘన విజయం అందించారు.

Share your comments

Subscribe Magazine