News

ఒక్క ఆవుతో 12 ఎకరాల్లో ప్రకృతి సాగు విధానం..

KJ Staff
KJ Staff

ఒక్క ఆవుతో 12 ఎకరాలను సాగు చేస్తున్నాడు ఓ రైతు. జనగామ జిల్లా కు చెందిన ఆర్ఎంపి వైద్యుడు, రైతు వెంకన్న. ఇక ఈయన పంట సేద్యపు వివరాల గురించి తెలుసుకుందాం. ఆయనకు ఉన్న 12 ఎకరాల పొలంలో ఎనిమిది ఎకరాల్లో మామిడి, కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నాడట. మిగతా నాలుగు ఎకరాల్లో నవారా, కాలబట్టి, రత్నచోడి, నారాయణ కామిని, సిరి సన్నాలు, రక్త శాలి వంటి సంప్రదాయ వరి వంగడాలను ఏడేళ్ల నుండి సాగు చేస్తున్నాడట. ఇక వాటిని శాస్త్రీయ పద్ధతిలో మాత్రమే విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాడట. ఇక ఒక్క ఆవుతో 12 ఎకరాల్లో ప్రకృతి సాగు విధానాన్ని చేస్తున్నాడట ఆ రైతు.

దిగుబడి తక్కువగా ఉన్నా.. రెట్టింపు ఆదాయం ఇచ్చేది మాత్రం ప్రకృతి వ్యవసాయం అని తెలిపాడు. బ్లాక్ రైస్ వరి రకం 135 నుండి 140 రోజుల వరకు పంటకాలం ఉండటంతోపాటు ఎకరానికి 15 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి ఇస్తుందట. గింజ ఎర్రగా, బియ్యం తెల్లగా ఉండే రకం 125 రోజుల వరకు పంట కాలాన్ని కలిగి ఉంటుందని, ఎకరానికి 25 బస్తాలు దిగుబడిని అందిస్తుందని తెలిపాడు. ఒక ఆవు తో నాలుగు ఎకరాల్లో కూడా సాంప్రదాయ పద్ధతిలో వరిని సాగు చేస్తున్నాడట ఆ రైతు.

ఆవు పేడ, మూత్రంతో ఘన జీవాతం, జీవామృతం తయారుచేసి నేలను దుక్కి పై పాట ఎరువులుగా పంటలకు అందిస్తాడట. చేప- బెల్లం ద్రావణం, కోడిగుడ్డు కషాయం, కుళ్ళిపోయిన పండ్లు - బెల్లం ద్రావణం, అల్లం+ బెల్లం+ వెల్లుల్లి ద్రావణం, బియ్యం కడిగిన నీటిలో ఆవు పాలు కలిపి సేంద్రియ ద్రావణం పదార్థంగా తయారుచేసి పంటలకు వాడుతానని తెలిపాడు. ఇక పందిరి కూరగాయల పంటలకు కూడా పండీగ సమస్య తీర్చుకోవడానికి ప్లాస్టిక్ సీసాతో ట్రాప్ ఏర్పాటు చేసుకొని సాగు చేయడం వల్ల మంచి లాభం ఉందని తెలిపాడు. తన దగ్గర ఉన్న విత్తనాలను ఇతర ప్రాంతాల రైతులు కూడా తీసుకెళ్తున్నారని తెలిపాడు. అంతేకాకుండా పాత వరి రకాల విత్తనోత్పత్తి గురించి శిక్షణ కూడా ఇచ్చామని తెలిపాడు.

Share your comments

Subscribe Magazine