News

మంత్రి క్యాంపు కార్యాలయం ముందు నిరసనకు దిగిన వరి రైతు!

Sriya Patnala
Sriya Patnala
paddy Farmer starts protest infront of minister's camp office in Jagityala for delay in procurement
paddy Farmer starts protest infront of minister's camp office in Jagityala for delay in procurement

జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా జరుపుకుంటున్న తరుణంలో శనివారం ధర్మపురి మండల సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ క్యాంపు కార్యాలయం ఎదుట ఓ రైతు వరిసాగును పారబోసి నిరసనకు దిగడం జరిగింది.

తెలంగాణ లో ఒక పక్క దశబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతులా దినోత్సవం ఘనం గా జరుగుతంటే మరో పక్క రైతుల పరిస్థితి మాత్రం అగాధం లోనే ఉంది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వం శనివారం రైతుల దినోత్సవాన్ని నిర్వహిస్తోన్నా అదే సమయం లో , వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం చెందిన ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన రైతు సత్తంశెట్టి రాజన్న తన వరి పంట ను ట్రాక్టర్‌లో తీసుకుని వచ్చి మంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించారు.

తూకం తగ్గించకుండా వరిధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేయక పోవడం వల్ల , రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆ రైతు వాపోయాడు. రైస్‌మిల్లర్ల అఘాయిత్యాల కు తోడయ్యి ప్రభుత్వ అధికారులు కూడా కనీస మద్దతు ధర కల్పించకుండా వరిధాన్యాన్ని అమ్మకానికి పెట్టారని ఆరోపించారు.

క్యాంపు కార్యాలయం ఎదుట వరిసాగును పోసి రైతు నిరసన చేస్తున్న సమయంలో , మంత్రి తన కార్యాలయంలోనే ఉండి రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవుతుండడం అతిశయోక్తి .

రైతులకు సరైన మద్దతు ధరలు ఇచ్చి, పంట కొనుగోళ్లు సకాలం లో జరిపించాలనే రైతుల నిరసనలు ఆగినప్పుడే రైతుల దినోత్సవం జరుపుకోడానికి సార్ధకత ఉంటుంది.

ఇది కూడా చదవండి 

రైతులకు సబ్సిడీలతో వ్యవసాయ యంత్రాల పంపిణీ..వ్యవసాయాన్ని లాభదాయకమైన వెంచర్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు

Share your comments

Subscribe Magazine