News

PM Kisan: త్వరలో 12వ విడత డబ్బులు..

Srikanth B
Srikanth B

పీఎం కిసాన్ e-kyc గడువు ముగిసింది , దీనితో త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 12 విడత డబ్బులను ఈనెల చివరి వరకు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మీడియా సంస్థల ద్వారా సమాచారం అందుతుంది . అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గ 3,93,7482 మంది లబ్దిదారులకు 100 శాతం డబ్బులను పంపిణి చేసింది , ఆంధ్రప్రదేశ్ లో 5974748 మంది లబ్ధిదారులకు గాను 80 శాతం లబ్ధిదారులకు డబ్బులను ఇప్పటికే పంపిణి చేసింది .

PM కిసాన్ పథకం ఏమిటి ?
ఈ పథకం కింద భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6 వేలు అందిస్తోన్నారు. నాలుగు నెలలకు రూ.2 వేల చొప్పున అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమా చేస్తున్నారు. ఇప్పటికే 11వ విడత డబ్బులు విడుదల చేయగా.. త్వరలో 12వ విడత డబ్బులు రానున్నాయి. అయితే ఈకేవైసీ చేసుకున్న వారికే డబ్బులు ఖాతాలో జమా అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది.

ఎవరు అనర్హులు :

ఈ పథకానికి ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు. వీరికి భూమి ఉన్నా పీఎం కిసాన్ డబ్బులు రావు. అలాగే ఒకే రేషన్ కార్డులో ఉన్న ఇద్దరి పేరుపై భూమి ఉంటే ఈ పథకాని ఒక్కరే అర్హులు అవుతారు. అయితే ఈకేవైసీ కోసం ఇప్పటికే గడువును పలుసార్లు పొడిగించారు.
eKYC ప్రక్రియ పూర్తి చేయాలంటే తప్పుకుండా ఫోన్ నెంబర్ ఆధార్ తో లింక్ అయి ఉండాలి. ఆధార్ లింక్ లేకుంటే మీ దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్ కు వెళ్లి ఆధార్ తో ఫోన్ నెంబర్ లింక్ చేయాలి. ఇందుకోసం వారు నామమాత్రపు రుసుం వసూలు చేస్తారు.

జూలై నెలలో కొత్తగా 53 లక్షల ఆధార్ కార్డు లు జారీ ..

eKYC ప్రక్రియ పూర్తి చేయాలంటే తప్పుకుండా ఫోన్ నెంబర్ ఆధార్ తో లింక్ అయి ఉండాలి. ఆధార్ లింక్ లేకుంటే మీ దగ్గరలో ఉన్న మీసేవ సెంటర్ కు వెళ్లి ఆధార్ తో ఫోన్ నెంబర్ లింక్ చేయాలి. ఇందుకోసం వారు నామమాత్రపు రుసుం వసూలు చేస్తారు.

ఈకేవైసీ చేసుకోండి ఇలా .

  • 1.ముందుగా PMkisan.gov.in వెబ్‌సైట్ వెళ్లాలి.
  • 2.అందులో ఫార్మర్ కార్నర్ ఉంటుంది.
  • 3. ఫార్మర్ కార్నర్ లో మొదటి ఆప్షన్ eKYC ఉంటుంది.
  • 4. eKYC పై క్లిక్ చేయాలి.
  • 5.అక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది
  • 6.ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ పై క్లిక్ చేయాలి
  • 7.ఆ తర్వాత ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
  • 8. మీ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఏటీపీ ఎంటర్ చేస్తే eKYC ప్రక్రియ పూర్తి అవుతుంది

జూలై నెలలో కొత్తగా 53 లక్షల ఆధార్ కార్డు లు జారీ ..

Share your comments

Subscribe Magazine