News

జులై 1 నుండి డెబిట్ కార్డు కొత్త నియమాలు... తప్పకుండ తెలుసుకోండి!

S Vinay
S Vinay

reserve bank of India:రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా బ్యాంకింగ్‌ రంగంలో ఎప్పటికప్పుడు నిబంధనలు మారుస్తుంటుంది.

జులై 1 నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డెబిట్ కార్డు మరియు క్రెడిట్ కార్డు లావాదేవీలలో టోకనైజేషన్‌ను విధానాన్ని ప్రవేశ పెట్టి చట్టబద్ధం చేసింది. కాబట్టి ఈ అంశం డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు ఖచ్చితంగా తెలుసుకోవాలి.టోకెన్ అని పిలువబడే ఒక ప్రత్యేక కోడ్‌తో, కార్డ్ హోల్డర్ టోకనైజేషన్‌ను అమలు చేయడం జరుగుతుంది. దీని ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారుల క్రెడిట్ కార్డ్ లను మరింత సురక్షితం చేయబోతోంది.


టోకనైజేషన్ అంటే ఏమిటి?
కొనుగోలు చెల్లింపుల విషయంలో డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. కార్డు మీదున్న 16 అంకెలు, కార్డు ఎక్స్‌పైరీ డేట్‌, సీవీవీ, ఓటీపీ, పిన్‌ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సున్నితమైన వివరాలను వ్యాపారులతో పంచుకోవాల్సి వస్తుంది. ఇది అంత సురక్షితం కాదు. అయితే ఇక నుండి ఈ ప్రక్రియ అంతా టోకెనైజేషన్‌ భర్తీ చేస్తుంది. దీని కొరకై మీరు మీ కార్డు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. మీ కార్డుకు సంబంధించిన టోకెనైజేషన్‌ నమోదు చేస్తే చాలు. అయితే వినియోగదారులు తమ కార్డును టోకెన్‌ రిక్వెస్ట్‌ అందించే ఒక ప్రత్యేక యాప్‌ ద్వారా టోకెనైజ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

బ్యాంకు వివరాలు మరింత సురక్షితం

కార్డ్ టోకనైజేషన్ సిస్టమ్‌కు ముందు, కార్డ్ హోల్డర్‌లు తమ కార్డ్ వివరాలను వెబ్‌సైట్‌లో ఇంటర్నెట్‌లో సేవ్ చేసేవారు .ఇది అనేక మంది సైబర్ మోసగాళ్లు కార్డ్ వివరాలను దొంగిలించడానికి దారితీసింది ఎంతో మంది తమ ఖాతా నుండి డబ్బును పోగొట్టుకోవడం కూడా మనం చూస్తూనే ఉన్నాము. మోసగాళ్లు మరియు పెరుగుతున్న కార్డ్ స్కామ్‌లను ఎదుర్కోవడానికి, RBI టోకనైజేషన్ - కార్డ్ లావాదేవీలను అమలు చేసింది, దీనిలో కార్డ్ వివరాలు ఎవరితోనూ పంచుకోబడవు, ఇంటర్నెట్‌లో సేవ్ చేయబడవు.బ్యాంకు వివరాలు మరింత సురక్షితం కాబోతున్నాయి.

మరిన్ని చదవండి.

క్రెడిట్ కార్డు వినియోగదారులకి శుభవార్త...ఇప్పుడు క్రెడిట్ కార్డులతో యూపీఐ పేమెంట్లు!

Share your comments

Subscribe Magazine