News

TELANGANA : నిరుద్యోగులకు అలర్ట్. నేటి నుంచి OTRలో సవరణలకి TSPSC ఆమోదం, రిజిస్ట్రేషన్ చేయడం ఎలా

S Vinay
S Vinay

ONE TIME REGISTRATION:నిరుద్యోగ అబిభ్యర్థుల కోసం ప్రవేశపెట్టిన వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (OTR)లో వ్యక్తిగత మార్పులను అనుమతిస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (సీఎం కేసీఆర్) అపాయింట్ మెంట్లు చేపడతామని అసెంబ్లీలో వెల్లడించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 80,000 పైగా ఉద్యోగాలకు ఆయా శాఖల వారీగా నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఇందులో భాగంగా తొలి విడతలో 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది.అభ్యర్థులు ఏదైనా పోస్ట్ కి దరఖాస్తు చేసుకునే ముందు ఖచ్చితంగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియని పూర్తి చేయవలిసి ఉంటుంది.ముందుగానే ONE TIME REGISTRATION ని నమోదు చేసుకున్న అభ్యర్థులకు ఏవైనా సవరణలు ఉంటే సరి చేసుకునే విధంగా అవకాశం కల్పించింది.అంతే కాకుండా కొత్తగా వచ్చిన అభ్యర్థులు తాజా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి TSPSC కింద ఏదైనా పోస్ట్ కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వెంటనే అధికారక వెబ్సైటు లోకి వెళ్లి ఈ ప్రక్రియని పూర్తి చేసుకోండి.

రిజిస్ట్రేషన్ చేయడం ఎలా:
ముందుగా TSPSC అధికారక వెబ్సైట్ కి వెళ్ళండి.

న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. మీ ఫోన్ నెంబర్ ని నమోదు చేయండి.

ఇప్పుడు మీ ఫోన్ కి OTP వస్తుంది దీనిని నమోదు చేయండి.

తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హత వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి.

ముందుగానే స్కాన్ చేసుకున్న మీ పాస్ఫోటో మరియు సంతకం ను అప్లోడ్ చేయండి. తర్వాత వచ్చిన కాపీ ని డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని చదవండి:

TS TET Update :Telangana TET నోటిఫికేషన్ విడుదల ... దరఖాస్తు చేసుకోండి !

Share your comments

Subscribe Magazine