News

TWITTER:ఎట్టకేలకు ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్...పాయిజన్ పిల్ కూడా కాపాడలేకపోయింది

S Vinay
S Vinay

రెండు వారాల క్రితం ట్విట్టర్ లో 9.2 శాతాన్ని కొనుగోలు చేసిన స్పేస్ X అధిపతి ఎలాన్ మస్క్ ప్రస్తుతం ట్విట్టర్ ని పూర్తిగా కొనుగోలు చేసారు.

అధికారకంగా ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో 100 శాతం వాటాను సుమారు $44 బిలియన్లకు కొనుగోలు చేసారు. ఒక్కో షేరుకు దాదాపు $54.20కి చెల్లించారు. ఈ కొనుగోలుకు సంబంధించి ట్విట్టర్ కి మరియు ఎలాన్ మస్క్ కి మధ్య కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎట్టకేలకు $44 బిలియన్లకు గాను ఒప్పొందం జరిగింది.

ట్విట్టర్ కి ప్రత్యామ్న్యాయంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ ప్రారంభించాలనుకున్న మస్క్?
గతంలో టెస్లా CEO ఎలాన్ మస్క్ ట్విట్టర్ స్వేచ్ఛా వాక్ హక్కును అణిచివేస్తుందని ఆరోపించాడు.మెరుగైన ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛా వాక్చాతుర్యం అవసరం అని ట్విట్టర్ ఈ సూత్రానికి కట్టుబడి ఉందని మీరు నమ్ముతున్నారా? అని పోల్ పెట్టినప్పుడు 70 శాతం మంది లేదు అని ప్రత్యుత్తరం ఇచ్చారు. గత నెలలో మస్క్ ట్విట్టర్‌లో తన ఫాలోయర్స్ ని ఉద్దేశించి కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించాలా అని అడిగినప్పుడు,ట్విట్టర్ ని కొనుగోలు చేయాలనీ పెద్ద ఎత్తున స్పందించారు.

మొదట నిరాకరించిన ట్విట్టర్ పాయిజన్ పిల్ కూడా కాపాడలేకపోయింది
ఈ నెల ప్రారంభంలో, మస్క్ ట్విట్టర్‌లో 9.2 శాతం వాటాను కొనుగోలు చేశారు. దీంతో అతను రెండవ అతిపెద్ద వాటాదారునిగా మారాడు.తర్వాత ట్విట్టర్ ని కొనుగోలు చేయడానికి ప్రతిపాదనను తెచ్చాడు మస్క్ దానికి బదులుగా ట్విట్టర్ CEO పరాగ్ అగర్వాల్ మస్క్‌ను బోర్డులో భాగమని స్వాగతించారు, కానీ బిలియనీర్ ఆఫర్‌ను తిరస్కరించారు. అప్పటి నుంచి ఎలోన్‌, ట్విట్టర్‌ల మధ్య గొడవలు మొదలయ్యాయి.ఎలాన్ మస్క్ ని ఎదుర్కోవడానికి ప్రారంభంలో పాయిజన్ పిల్ అని పిలిచే యాంటీ-టేకోవర్ ను అమలు చేసింది ట్విట్టర్ ,ఈ చర్య కొనుగోలు (takeover)ప్రయత్నాన్ని చాలా ఖరీదైనదిగా చేస్తుంది. అయినప్పటికీ చివరగా ఎలాన్ మస్క్ ట్విట్టర్ ని మొత్తంగా అధీనం చేసుకున్నాడు. వాక్ స్వాతంత్రానికి కొత్త రూపాన్ని ఇస్తానని ప్రకటించారు ఎలాన్ మస్క్.

మరిన్ని చదవండి.

క్వినోవా తో వృధ్యాప్త ఛాయలను అరికట్టండి!

Related Topics

twitter elan musk poison pill

Share your comments

Subscribe Magazine