News

దేశంలో భారీగా పెరగనున్న గోధుమ ఉత్పత్తి !

Srikanth B
Srikanth B
దేశంలో భారీగా పెరగనున్న గోధుమ ఉత్పత్తి ! Image credit :Pexels
దేశంలో భారీగా పెరగనున్న గోధుమ ఉత్పత్తి ! Image credit :Pexels

భారదేశంలో గోధుమల ఉత్పత్తి ఈ సంవత్సరం ప్రాథమిక అంచనాలను అధిగమించే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది
2020-21 సంవత్సరంలో గోధుమ ఉత్పత్తి 109.59 మిలియన్ టన్నులు కాగా ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 112.18 మిలియన్ టన్నుల ఉత్పత్తి తో ప్రభుత్వం ప్రాథమిక అంచనాలను అధిగమించే అవకాశం ఉంది .

ఇప్పటివరకు భారతదేశంలో రికార్డు స్థాయిలో 109.59 మిలియన్ టన్నుల గోధుమలను ఉత్పత్తి కాగా ఇప్పుడు మునుపటి రికార్డులను తిరగరాసే విధంగా 112.18 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించనుంది .

కొన్ని ప్రాంతాలలో గోధుమ నాణ్యతపై ప్రతికూల వాతావరణం ప్రభావం చూపినప్పటికీ, ముఖ్యమైన పెరుగుతున్న రాష్ట్రాల్లో పంట దిగుబడుల అంచనా పెరుగుదల కారణంగా 2022–23 పంట సంవత్సరంలో (జూలై–జూన్) రికార్డు స్థాయిలో 112.18 మిలియన్ టన్నులు ఉంటుందని ప్రభుత్వం అంచనాలను వేస్తుంది .

ఇది కూడా చదవండి .

మీడియా నివేదికల ప్రకారం, అధిక పంట దిగుబడి కారణంగా, గోధుమ ఉత్పత్తి అంచనా వేయబడిన 112.18 మిలియన్ టన్నులకు మించి ఉంటుందని అంచనా. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో పంటల దిగుబడి పెరిగినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీనికి కారణం గత ఐదేళ్లుగా వాతావరణ నిరోధక గోధుమ రకాలను ప్రభుత్వం ప్రోత్సహించడం వల్ల దిగుబడి మెరుగుపడిందని ఆయన అన్నారు.

మార్చి మరియు ఏప్రిల్‌లలో కురిసిన అకాల వర్షాల కారణంగా గోధుమలను ఉత్పత్తి చేసే కొన్ని రాష్ట్రాలలో పంట నష్టం మరియు పంట నాణ్యత కూడా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు లేనిపక్షంలో ఇంకా అధిక మొత్తంలో పంట ఉత్పత్తి జరిగివుండేదని అంచనా .

ఇది కూడా చదవండి .

Share your comments

Subscribe Magazine