News

ప్రపంచ అటవీ దినోత్సవం:అవగాహనా కార్యక్రమాలు ఘనంగా చేపట్టిన తెలంగాణా అటవీ శాఖ

S Vinay
S Vinay

మార్చి 21వ తేదీ అంతర్జాతీయ అటవీ దినోత్సవ సందర్బంగా తెలంగాణ అటవీ శాఖ అడవుల సస్య రక్షణ గురించ్చి వివిధ కార్యక్రమాలను నిర్వహించింది.అడవుల ప్రాముఖ్యత గురించి ప్రజలకి తెలియజేయటానికి అటవీ శాఖ వారు అటవీ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా చేపట్టారు.


హైదరాబాద్ లో ఉన్నా కాసు బ్రహ్మానంద రెడ్డి జాతీయ పార్క్ లో అటవీ దినోత్సవ కార్యక్రమాలను అటవీ శాఖ నిర్వహించింది ఇందులో ముఖ్య అతిధులుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, పి నవీన్ రావు మరియు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. వీరందరూ కూడా పార్క్ లో మొక్కలను నాటారు. అటవీ శాఖ అధికారి RM డోబ్రియాల్ మాట్లాడుతూ అడవుల సస్య రక్షణ ఆవశ్యకత గురించి తెలియపరుస్తు తెలంగాణ లో అమలులో వున్నా హరిత హారం కార్యక్రమానికి సంబంధించిన ప్రాముఖ్యతని వివరించారు. “జంగిల్ బచావో జంగిల్ బడావో” నినాదంతో హరితహారం, క్షీణించిన అడవుల పునరుద్ధరణకు దోహదపడుతుందని వెల్లడించారు. మర్రి మొక్కని నాటిన ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ గ్లోబల్ వార్మింగ్ ని సమిష్టిగా ఎదుర్కోవడానికి మొక్కలు నాటడమే పరిష్కారం అన్నారు అంతే కాకుండా పట్టాన ప్రాంతాల్లో జాతీయ వనాలు సాధించిన అభివృద్ధిని కొనియాడారు.మొక్కలు నాటడానికి సమాజంలోని అందరు స్వచ్చందంగా ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. అభయారణ్యాల సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించారు. అటవీశాఖ సిబ్బంది అటవీ సమీప గ్రామాల ప్రజలతో సమావేశమై అగ్నిప్రమాదాల నివారణ, అటవీ భూముల పరిరక్షణకు అవసరమైన చర్యలపై అవగాహన కల్పించారు.


భారతదేశం యొక్క అటవీ విస్తీర్ణం ఇప్పుడు 7,13,789 చదరపు కిలోమీటర్లు, దేశ భౌగోళిక ప్రాంతంలో ఇది 21.71%. చెట్ల విస్తీర్ణం 721 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది.అటవీ విస్తీర్ణంలో అత్యధికంగా పెరిగిన రాష్ట్రాలు తెలంగాణ (3.07%), ఆంధ్రప్రదేశ్ (2.22%) మరియు ఒడిశా (1.04%). ప్రాంతాల వారీగా: మధ్యప్రదేశ్‌లో దేశంలోనే అతిపెద్ద అటవీ విస్తీర్ణం కలిగి ఉంది, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మరియు మహారాష్ట్ర ఉన్నాయి.మొత్తం భౌగోళిక అటవీ విస్తీర్ణంలో మొదటి ఐదు రాష్ట్రాలు మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ మరియు నాగాలాండ్. అటవీ విస్తీర్ణంలో 35.46% మంటలకు గురవుతుంది . ఇందులో2.81% అత్యంత ప్రమాదకరమైనవి. 2030 నాటికి భారతదేశంలోని 45-64% అడవులు వాతావరణ మార్పు మరియు పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావాలకుగురయ్యే అవకాశాలు వున్నాయి

అటవీ దినోత్సవం ఎప్పుడు మొదలైంది:
ఐక్యరాజ్యసమితి 2012లో మార్చి 21వ తేదీని అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్చ్ 21న అటవీ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు.
దాదాపు 1.6 బిలియన్ల మంది ప్రజలు ఆహారం, ఆశ్రయం, ఆదాయం కోసం నేరుగా అడవులపై ఆధారపడుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 మిలియన్ హెక్టార్ల అడవిని కోల్పోతున్నాం.
2022 world forestry day theme: Forests and Sustainable Production and Consumption

మరిన్ని చదవండి.

కనీస మద్దతు ధర కోసం మరో ఉద్యమం .. 25 రాష్ట్రాల రైతుసంఘాల సమావేశం !

Share your comments

Subscribe Magazine