Agripedia

పూల సాగుతో లక్షల ఆదాయం పొందుతూ ఎందరికో ఆదర్శంగా నిలిచిన రైతు!

KJ Staff
KJ Staff

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చాలామంది రైతు సోదరులు సాంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి ఏడాది పొడవునా ఆదాయాన్ని సమకూర్చే పూల సాగు చేపట్టి అధిక లాభాలను పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో జార్ఖండ్‌ రాష్ట్రం, రాంచీ జిల్లాకు చెందిన
శ్యామ్ సుందర్ బెడియా అనే రైతు తనకున్న కొద్దిపాటి పొలంలో ప్రభుత్వ సహకారంతో పాలీహౌస్ నిర్మించింది బంతి ,గులాబీ, జేర్బెరా, గ్లాడియులస్ పువ్వులను సాగుచేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

శ్యాంసుందర్ బేడియా మొదట ఒక ఎకరాలో పూల పెంపకాన్ని ప్రారంభించి తన అనుభవాన్ని రెట్టింపు చేసుకుంటూ ప్రస్తుతం 12 ఎకరాల్లో వివిధ రకాల పూలు, కూరగాయలు సాగుచేస్తూ రాష్ట్రంలో ఆదర్శ రైతుగా గుర్తింపు పొందారు.జార్ఖండ్‌లోని వివిధ జిల్లాల నుండి పూల సాగు పై ఆసక్తి ఉన్న రైతులు ఇతని దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. వ్యవసాయ విద్యార్థులు ఇతని పూల క్షేత్రానికి వచ్చి ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటారు. ప్రస్తుతం శ్యాంసుందర్ దాదాపు మూడు వేల మంది రైతులకు పూల సాగుపై శిక్షణ ఇస్తున్నాను.

శ్యాంసుందర్ 2010 సంవత్సరంలో పూల సాగు పెంపకాన్ని ప్రారంభించారు. తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువు మధ్యలోనే ఆపేసి
రామకృష్ణ మిషన్ , ICAR పాలందులో వ్యవసాయంలో శిక్షణ తీసుకున్నారు.తర్వాత ఉద్యాన పంటల శిక్షణ కోసం రాజస్థాన్ వెళ్లి గులాబీ, జేర్బెరా వంటి పూల సాగు పై శిక్షణ తీసుకొని గవర్నమెంట్ సహకారంతో పాలీహౌస్ నిర్మించుకొని పూల సాగు ప్రారంభించారు.

ప్రస్తుతం శ్యాంసుందర్ బేడియా దాదాపు 12 ఎకరాల్లో పాలీహౌస్ నిర్మించి వివిధ రకాల నాణ్యమైన పూలను సాగు చేస్తూ ఏడాదికి 8 నుంచి 10 లక్షలు సంపాదించి తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతను రాష్ట్రంలోని ప్రగతిశీల రైతుల్లో ఒకరుగా నిలిచారు. ఇటీవలే జార్ఖండ్ ప్రభుత్వం శ్యాంసుందర్ బేడియాని వ్యవసాయంలో మెరుగైన ఆధునిక పద్ధతులను తెలుసుకోవడానికి ఇస్రాయిల్ దేశానికి పంపడం జరిగింది.

Share your comments

Subscribe Magazine