Agripedia

ఇంటి ,అలంకరణ మొక్కలు చనిపోవడానికి ప్రధాన కారణాలు :

Srikanth B
Srikanth B

ఇది ప్రతి ఇంట్లో మొక్కలను పెంచే తోటమాలి ఆలోచించిన వలసిన ప్రశ్న. ఇంటిలో పెంచే మొక్కలు మన యొక్క మానసిక ఆరోగ్యానికి మరియు ఇంటి యొక్క అలంకరణ కోసం పెంచుతుంటారు .అయితే ఇవి అప్పుడపుడు ఆకస్మికంగా చనిపోతూవుంటాయి . అయితే మొక్కలు ఆ కారణంలేకుండా చనిపోవు అవి చనిపోవడానికి గల ప్రధాన కారణాలు ఇక్కడ వివరించబడ్డాయి.

ప్రధాన కారణాలు :

1. ఎక్కువ నీరు పోయడం ;

అధికంగా నీరు పోయడం ఏది మీకు కొంచం ఆశ్చర్యం గ అనిపించవచ్చు కానీ ఏది ముమ్మాటికీ నిజం మరియు ఏది ప్రతిఒక్కరు చేసే సాధారణ పొరపాటు కూడా ఎందుకంటే మనం ఇంటిలోపల పెంచే మొక్కలు కొన్ని ఉష్ణ మండల జాతికి చెందినవి ఉంటాయి అవ్వి సాధారణం కంటే చాల తక్కువ నీటిని తీసుకుంటాయి కానీ మనం ఎడతెరిపి లేకుండా నీటిని ఇవ్వడం వల్ల అవి చనిపోతాయి . అయితే దీన్నిని నివారించడానికి మొక్క కుండి లో మట్టి తడి ఎండానంత వరకు నీటిని ఇవ్వకపోవడం మంచిది .


2. కుండీలలో నీటిపారుదల సరిగాలేకపోవడం
మొక్కల కుండీలలో నీరు పోసి చాల మంది అలాగే వదిలేస్తారు అలాచేయడం వల్ల నీరు చాల సమయం వరకు నిలువ ఉండి మొక్క యొక్క వేర్లు కుళ్లిపోవడం జరుగుతుంది , వేర్లు కుళ్లిపోవడం ద్వారా మొక్క చనిపోవడం జరుగుతుంది అందుకే మొక్కల కుండీల లలో నీరు ఎక్కువ సమయం నిల్వలేకుండా చర్యలు తీసుకోవాలి.
ఒక మొక్క యజమాని ఒకటి లేదా రెండు సంవత్సరాల పాటు ఒక మొక్కను ఉంచడం చాలా సాధారణం, ఈ సమయంలో ఒక్క మంచిగా వృద్ధి చెందుతుంది మరియు అద్భుతంగా కనిపిస్తుంది, మొక్క అకస్మాత్తుగా చనిపోయినప్పుడు మీరు ఆశర్యపోతారు ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి పెంచుతున్న మొక్క కాబట్టి దానిన్ వేరు వేవస్థ సరిగా వీరిది చెందక పోవడం వాళ్ళ ఆలా జరగవచ్చు .

. ఇది తరచుగా వేరు-బంధిత మొక్క వల్ల కలుగుతుంది, ఇది ఇకపై మట్టి నుండి తగిన పోషకాహారాన్ని పొందదు (ఇది లేకపోవడం వల్ల). అన్ని మొక్కలకు ప్రతి సంవత్సరం రెపోటింగ్ అవసరం లేనప్పటికీ, వేరు-బంధిత మొక్కల కోసం మీరు ఒక కన్ను ఉంచాలి.

3. పాత కుండ మట్టిని ఉపయోగించడం

ఇంతకు ముందు మొక్కలకు ఉపయోగించిన పాత మట్టి కుండలను ఉపయోగించడం ద్వారా మట్టి లోని సారం తగ్గిపోతుంది , మరియు
అందులో నీటిని పోయడం ద్వారా నెల గట్టిపడి పోయి ఉంటుంది దాని వాళ్ళ కొత్తగా నాటే మొక్క వేర్లకు సరైన ఆక్సిజన్ లభించదు, ఆక్షిజన్ సరిగా లభించక పోవడం మొక్క లో జీవ క్రియలు సరిగా జరగక పోవడం వల్ల మొక్క చనిపోతుంది .

4. ఎరువుల సమస్యలు
ఇంటిలో పెంచే మొక్కలను మనం ఇంటిలో నాటడం వరకే జాగ్రత తీసుకుంటాం తరువాత వాటి పెరుగుదల కు కావాల్సిన పోషకాలను అందించడం ఎరువుల లను అందించడం గురించి అస్సలు ఆలోచించం అప్పుడు వాటికీ సరైన పోషకాలు లభించక కూడా చనిపోతుంటాయ్ .

కనుక మొక్క నాటి నప్పటి నుంచి పైన సూచించిన విధంగా చర్యలు తీసుకోండి .

Share your comments

Subscribe Magazine