Agripedia

వరి సాగు యాజమాన్య పద్ధతులు!

Srikanth B
Srikanth B
paddy cultivation methods
paddy cultivation methods

మన రెండు తెలుగు రాష్ట్రాలలో వరి పంట ప్రధానమైనది, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో కలుపుకొని సుమారుగా 88 లక్షల హెక్టార్లలో వరి సాగు జరుగుతుంది ,అత్యధికంగా పండిస్తూ మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా వరి వర్షాకాలం పంట అయినప్పటికీ యాసంగిలో కూడా వరిని విస్తారంగా పండిస్తున్నారు.

అనువైన నేలలు:
బంక నేలలు మరియు ఒండ్రు నేలలు వరి సాగుకు అనువైనవి , ఆమ్ల స్థాయి ఎక్కువగా ఉన్న నేలల్లో దిగుబడి అధికంగా ఉంటుంది

ఉత్తమ రకాలు:
తెలంగాణ:తెలంగాణ సోనా, సాంబ మసూరి ,ప్రాణహిత మరియు సిద్ద మొదలైనవి అధిక దిగుబడినిస్తాయి
ఆంధ్రప్రదేశ్ :విజేత,సోనా మషూరి(బిపిటి-3291),సాంబ మషూరి(బిపిటి5204,వజ్రం మరియు ఇంద్ర

విత్తన మోతాదు :
ఒక హెక్టారుకు 40 నుండి 60 కిలోల విత్తనాలు కావాలి

విత్తన శుద్ధి:
లీటర్ నీటికి ఒక గ్రాము కార్బెన్డిజం చొప్పున ఒక రోజంతా నానబెట్టుకొని మండే కట్టుకోవాలి


నారుమడి:
ఒక హెక్టారు పొలానికి 100 చదరపు మీటర్ల నారుమడి సరిపోతుంది, నారుమడిని దుక్కి దమ్ము చేసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలను చల్లుకొని ఆరు తడులు ఇవ్వాలి. నారుమడిలో జింక్ లోపం తలెత్తకుండా లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ని కలుపుకొని పిచికారి చేసుకోవాలి . సుమారుగా 14 నుండి 16 రోజులకి ప్రధాన పొలంలో నాటుకోవటానికి నారు సిద్ధంగా ఉంటుంది. బంక నేలల్లో బాగా దమ్ము చేసి విత్తే సమయానికి నేల బురదగా ఉండేట్లు చూసుకోవాలి

ప్రధాన పొలం;
నాట్లు వేయడానికి రెండు వారల ముందే పొలాన్ని దమ్ము చేసుకోవాలి. నేలను బాగా చదును చేసుకొని సమంగా చేసుకోవాలి నేలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి దీనికొరకు పొలాలను మడులుగా విభజించుకోవాలి నీటి పారుదల సులభంగా జరగడం కోసం పిల్ల కాలువలను ఏర్పాటుచేసుకోవాలి. సుమారుగా నాలుగు లేక ఐదు ఆకులు ఉండి ఆరోగ్యాంగా ఉన్న నరుని మాత్రమే నాటుకోవాలీ

ఎరువులు :
భూసార పరీక్షలు చేసి దానికి తగినట్లుగా ఎరువులను చల్లుకోవాలి,అజోల్లా మరియు నీలి ఆకుపచ్చ శైవలాలను వాడటం వల్ల 25 శాతం నత్రజనిని ఆదా అవుతుంది
నత్రజని,భాస్వరం,మరియు పోటాష్ లను 4:2:1 నిష్పత్తి లో వేసుకోవాలి. నత్రజనిని మూడు భాగాలుగా విభజించి విత్తిన 20 రోజులకి ఒకసారి 40 రోజులకి రెండో సారిగా చివరిగా 60 రోజులకి వేసుకోవాలి

పురుగుల బెడద:
వరి ఈగ,ఉల్లి కోడు,తామర పురుగులు ,ఆకునల్లి మరియు కంకినల్లి వంటి వాటి తాకిడి ఎక్కువగా ఉంటుంది. వీటి నివారణకు కార్బొఫురన్ 3జి గుళికలు , మోనోక్రాటోఫాస్ ,గంధకం లను వాడుకోవాలి , నత్రజని మోతాదుకు మించి వాడటం వల్ల పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది

కలుపు యాజమాన్యం :
కలుపు మొక్కల నియంత్రణ కి బ్యూటాక్లోర్‌ ,ప్రెటిలాక్లోర్‌,ఆక్సాడయార్జిల్‌, వంటి వాటిని చల్లుకోవాలి , గడ్డి జాతి కలుపుకి బిస్‌పైరిబాక్‌ ని పిచికారీ చేసుకోవాలి.

సమయానికి తగిన చర్యలు తీసుకుంటే వారిలో అధిక దిగుబడి సాధించి మంచి లాభాలను గడించవచ్చ

వరి సాగు చేసే రైతు సోదరులకు అధిక లాభాన్ని ఇచ్చే వరి వంగడాలు !

Share your comments

Subscribe Magazine