Health & Lifestyle

10 కిలోల ఉచిత బియ్యం డిసెంబర్ వరకు పొడగింపు ..

Srikanth B
Srikanth B
10 kg free rice extension till December by civil supply department of Telangana
10 kg free rice extension till December by civil supply department of Telangana

రేషన్ లబ్ధిదారుల్లో మనిషికి 10కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది దీనితో 2.84 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందని సివిల్‌ సప్లయ్​ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. కేంద్రం 54.37 లక్షల కార్డులు, 1.91 కోట్ల మందికి 5కిలోల చొప్పున ఉచిత రేషన్ అందజేస్తుందని, మిగతా 35.64 లక్షల కార్డులు, 91.72 లక్షల మందికి రాష్ట్రమే పూర్తిగా సబ్సిడీ భరించి ఫ్రీ రేషన్ సరఫరా చేస్తుందన్నారు.

అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కాలానికి పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన స్కీంను కేంద్రం పొడిగించిందని తెలిపారు. దీనికోసం రాష్ట్ర కార్డులకే 19,057 లక్షల టన్నుల బియ్యం అదనంగా తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తుందని చెప్పారు.

గరీబ్ కల్యాణ్ యోజన మరిన్ని నెలలు పెంపు :

మీడియా నివేదికల ప్రకారం, ప్రభుత్వం ప్రస్తుతం పేదలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని మరో 3 నుంచి 6 నెలల వరకు పెంచనున్నట్లు సమాచారం. అయితే, దీనివల్ల ప్రభుత్వానికి 10 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది.

రద్దు దిశగా రేషన్ కార్డులు
రేషన్ కార్డు రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. దీని ప్రకారం మీరు అనర్హులుగా తేలితే మీ రేషన్ కార్డు కూడా రద్దవుతుంది వీటతో పాటు ప్రభుత్వం మరో విజ్ఞప్తి కూడా చేస్తోంది. అనర్హులు ఎవరైనా, వారి రేషన్ కార్డును వారి స్వంతంగా రద్దు చేయాలని లేదంటే ప్రభుత్వం గుర్తించి రేషన్‌ రద్దుతో పాటు వారిపై చర్యలు కూడా తీసుకోనున్నట్లు తెలిపింది.

రేషన్ కార్డు కొత్త నిబంధనలు :

మీ సొంత ఆదాయంతో సంపాదించిన 100 చదరపు మీటర్ల ప్లాట్/ఫ్లాట్ లేదా ఇల్లు, ఫోర్ వీలర్ వెహికిల్/ట్రాక్టర్, ఆయుధాల లైసెన్స్, కుటుంబ ఆదాయం రెండు లక్షల కంటే ఎక్కువ (గ్రామంలో), అదే నగరంలో సంవత్సరానికి మూడు లక్షలు ఉంటే, అలాంటి వారు వారి రేషన్ కార్డును ప్రభుత్వ సంబంధిత కార్యాలయంలో సమర్పించాలి .

పీఎం కిసాన్ యోజన తాజా అప్‌డేట్: దసరాకు ముందు 12వ విడత విడుదల..

Share your comments

Subscribe Magazine