Health & Lifestyle

కళ్ల కలక రావడానికి కారణాలేంటి ? ఎలా వ్యాపిస్తుంది?

Srikanth B
Srikanth B
కళ్ల కలక రావడానికి కారణాలేంటి ? ఎలా వ్యాపిస్తుంది?
కళ్ల కలక రావడానికి కారణాలేంటి ? ఎలా వ్యాపిస్తుంది?

వర్షాకాలం సీజన్ ప్రారంభం కాగానే అనేకరకాల వైరల్ మరియు బాక్టీరియా ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాపిస్తుంటాయి . జ్వరాల నుంచి మొదలుకొని అనేక వ్యాధులు వర్షాకాలంలో వ్యాపిస్తుంటాయి వాటిలో అతి సాధారణమైన "కళ్ల కలక" కూడా ఒకటి ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలలో దీని ప్రభావం కనిపిస్తుంది .

కళ్ల కలక ను 'ఐ ఫ్లూ'ను వైద్య పరిభాషలో కంజంక్టివైటిస్ అంటారు . సాధారణంగఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రజలు 'ఐ ఫ్లూ'తో ఇబ్బంది పడుతున్నారు.ఇది ఒక రకమైన ఇన్‌ఫెక్షన్. ఒక్కోసారి జలుబుకు కారణమైన వైరస్ వల్ల కూడా కళ్ల కలకలు వస్తుంటాయి.కళ్లలో మంట, కంటి నుంచి నీరు కారడం, నిద్ర లేచేసరికి రెప్పలు అతుక్కోవడం, కళ్లలో పుసి ఏర్పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కొన్ని సార్లు కంట్లో ఏవైనా రసాయనాలు పడినా, గాలి కాలుష్యం వల్ల, ఫంగస్ వల్ల, కొన్ని రకాల పరాన్నజీవుల వల్ల కూడా కళ్ల కలకలు వస్తుంటాయి . బ్యాక్టీరియా వల్ల వచ్చే ఐ ఫ్లూ లేదా వైరల్ ఐ ఫ్లూ చాలా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కాబట్టి కళ్ల కలక సోకినా వ్యక్తి అధిక రద్దీ ఉన్న ప్రాంతాలలో తిరగక పోవడం మంచిది.

షుగర్ మరియు బరువు తగ్గాలా? అయితే ఈ ఎండు ద్రాక్ష నీళ్లు ట్రై చేయండి..

కళ్ల కలక వచ్చిందని ఎలా నిర్దారించుకోవాలి ?

కళ్లు ఎరుపెక్కడం, నీరు కారడం, దురదగా ఉండటం, కంటి రెప్పలు అంటుకుపోవడం వంటివి కళ్లకలకలో ఉండే ప్రధాన లక్షణాలు.
ఈ లక్షణాలు కనిపిస్తే కళ్లకలకలు వచ్చాయని అర్థం. అయితే కొన్నిఇతర రకాల ఐ ఇన్‌ఫెక్షన్లలో కూడా కంటి రెప్పలు అంటుకుంటుంటాయి. ఇటువంటి సందర్భములో సమీప వైద్యుడిని సంప్రదించండి .

షుగర్ మరియు బరువు తగ్గాలా? అయితే ఈ ఎండు ద్రాక్ష నీళ్లు ట్రై చేయండి..

Share your comments

Subscribe Magazine