News

నిరుద్యోగులకు ప్రతీ నెల రూ.3 వేలు.. ఈ విషయంపై ప్రభుత్వం ఎప్పుడు శుభవార్త చెప్పనుంది?

Gokavarapu siva
Gokavarapu siva

రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నదున తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు వరుసగా శుభవార్తలు అందిస్తుంది. రాష్ట్రంలోని ప్రజలకు దళితబంధు, మైనారిటీ బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి అని అనేక పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరొక శుభవార్తను అందించడానికి సిద్ధంగా ఉంది.

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వనున్నట్లు తెలిపింది. కాగా నిరుద్యోగ భృతిపై యువత గంపెడు ఆశలు పెట్టుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వంపై పీకల్లోతు కోపంపై ఉన్నారనేది నిజం. ఈ నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.

30 ఏళ్లలోపు నిరుద్యోగులందరికి కూడా ప్రతీ నెల రూ.3016 భృతి ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇప్పటి ఈనికలు కూడా వచ్చేస్తున్నా కూడా ఆ పధకం అమలులోకి రాలేదు. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. దీనితో వీరి ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రభుత్వం భావిస్తుండగా ఈ మేరకు కీలక ప్రకటన చేయనుందని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి..

దేశంలో రైతులకు వ్యవసాయ యంత్రాలపై ఉన్న సబ్సిడీలు.. ఏ రాష్ట్రంలో ఎంతంటే?

తెలంగాణ ప్రభుత్వం ఈ నిరుద్యోగ భృతిపై ఈ నెల అనగా ఆగస్టు 21న శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఈ విచారణలన్నింటినీ పరిష్కరించాలని మరియు ప్రకటన రోజునే సమగ్ర మార్గదర్శకాలను అందించాలని భావిస్తోంది. మరి ఇన్నిరోజులు నిరుద్యోగ భృతిపై ఊరించిన ప్రభుత్వం ఈసారి ప్రకటన చేయడం ఖాయంగా తెలుస్తుంది.

ఎన్నిక‌ల స‌మ‌యంలో సీఎం కేసీఆర్ రైతుబంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు, ఇది టీఆర్‌ఎస్ పార్టీ మ‌ళ్లీ ఎన్నిక‌లు కావ‌డంలో విశిష్ట పాత్ర పోషించింది. రైతు బంధు వాగ్దానం కారణంగా పార్టీకి అధిక సంఖ్యలో ఓటు వేసిన రైతుల నుండి ఈ పథకానికి అపారమైన మద్దతు లభించింది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీకి యువత వ్యతిరేకంగా కనిపిస్తుంది. వారికి ప్రతీ నెల నిరుద్యోగ భృతి అందిస్తే వారి ఓట్లు పడతాయని ప్రభుత్వం భావిస్తుంది.

ఇది కూడా చదవండి..

దేశంలో రైతులకు వ్యవసాయ యంత్రాలపై ఉన్న సబ్సిడీలు.. ఏ రాష్ట్రంలో ఎంతంటే?

Related Topics

cm kcr

Share your comments

Subscribe Magazine