News

టమాటలు అమ్మి 2 కోట్లు సంపాదించినా రైతు !

Srikanth B
Srikanth B
టమాటలు అమ్మి 2 కోట్లు సంపాదించినా రైతు !
టమాటలు అమ్మి 2 కోట్లు సంపాదించినా రైతు !

కొద్దీ రోజుల క్రితం పెట్టిన పెట్టుబడి రాక ఇబ్బందులు పడ్డ రైతులు టమాటో నేడు దశ తిరిగి ఒక రోజులలోనే కోటీశ్వరులు అవుతున్నారు. ఎప్పుడు 40 కు దాటని టమాటో ధర ఇప్పుడు ఏకంగా రూ. 200 కు చేరడంతో రైతులు ఒక రోజులోనే లక్షాధికారులు అవుతున్నారు. అలాగే టమాటో సాగు చేసిన పూణే రైతు కోటీశ్వరుడు గ మారిన కథనం క్రింద చూద్దాం.

పుణెకి చెందిన ఈశ్వర్ గయాకర్ అనే 36 ఏళ్ల రైతు తన 12 ఎకరాల పొలంలో టమాట పంటను సాగు చేయగా దాదాపు 4 లక్షల దిగుబడి వచ్చింది వీటిని మార్కెటు విక్రయించిన రైతుకు వాటి ద్వారా రూ.2.8 కోట్లు సొమ్ము చేసుకున్నాడు. ఇంకా అతని దగ్గర 60 వేల కిలోల టమాట ఉంది. వాటిని కూడా ఇదే ధరల్లో విక్రయించి ఈ సీజన్‌లో తన సంపాదనను రూ.3.5 కోట్లకు పెంచుకోవాలని భావిస్తున్నట్లు గయాకర్‌ మీడియాకు తెలిపాడు.


సాధారణంగా పరిస్థితులలో అయితే కిలో టమాట ధర రూ.20 నుంచి రూ.30 వరకు ఉండేది. కానీ గత సీజనులో కురిసిన అకాల వర్షాలకు భారీ పంట నష్టం జరిగింది దీనికి తోడు విపరీతమైన ఎండల కారణంగా తగ్గిన సాగు టమాటో పంటలో ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడం కారణముగా టమాట ఏకంగా రూ.150 నుంచి రూ.200 వరకు ధర పలికింది దీనితో రైతులు ఊహించని విధంగా ధరలు పెరగడంతో రైతులు కోటీశ్వరులు అవుతున్నారు.

రైతులకు శుభవార్త.. త్వరలో రాష్ట్రంలో అర్హులైన రైతులకు రూ.లక్ష రుణమాఫీ..

2021లో టమాట సాగువల్ల రూ. 20 లక్షల నష్టం వచ్చిందని తెలిపాడు. అయితే, తాము కేవలం టమాటలను మాత్రమే కాకుండా సీజన్‌ల వారీగా ఉల్లిపాయలు, పువ్వులను కూడా సాగు చేస్తామని రైతు ఈశ్వర్ తెలిపారు .

మరో కొద్దీ రోజులలో క్రమంగా ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు గత రెండు మూడు రోజుల నుంచి ధరలు క్రమంగా తగ్గుదల చూపిస్తున్నాయని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

రైతులకు శుభవార్త.. త్వరలో రాష్ట్రంలో అర్హులైన రైతులకు రూ.లక్ష రుణమాఫీ..

Related Topics

Tomatoprice

Share your comments

Subscribe Magazine