News

సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన అల్లం, చింతపండు ధరలు..

Gokavarapu siva
Gokavarapu siva

ధరల నియంత్రణ విషయంలో మోదీ ప్రభుత్వ పనితీరు చాలా నిరాశాజనకంగా ఉంది. ఇటీవలి కాలంలో పెట్రోలు, వంటగ్యాస్ ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా వంటనూనెల ధర కూడా రికార్డు స్థాయికి చేరుకోవడంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది.

అయితే టమాటా, చింతపండు ధరలు కూడా ఇప్పుడు భారీగా పెరుగుతున్నాయి. ఇక తన వంతు అన్నట్టు అల్లం ధర కూడా అందనంత ఎత్తుకు చేరుతున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో అల్లం రూ.400లకు అమ్ముడు పోవడంతో సామాన్యుల ఆర్థిక ప్రణాళికలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పోటీతత్వంతో పెరుగుతున్నప్పటికీ, పెరుగుతున్న ఈ ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సమర్థవంతమైన చర్యలు చేపట్టడంలో విఫలమవుతోందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం కర్ణాటక బహిరంగ మార్కెట్‌లో కిలో అల్లం ధర రూ. 300 నుంచి రూ. 400 ఉంది. 60 కిలోల అల్లం ఉన్న బ్యాగ్ ధర రూ. 11,000. వ్యాపారుల ప్రకారం, గత ఏడాది ఇదే కాలంలో, ఒక బ్యాగ్ ధర రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు ఉండేది. అల్లం ధరలు గత పదేళ్లలో ఇంత పెద్దఎత్తున పెరగకపోవడం గమనార్హం. గత రెండు పంటల సీజన్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రత్యేకించి భారీ వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా చింతపండు దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు.

సాధారణంగా ఎకరాకు సగటున 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా గత రెండేళ్లలో ఎకరాకు 1 నుంచి 2 క్వింటాళ్లకు పడిపోయింది. దిగుబడిలో ఈ గణనీయమైన తగ్గుదల మార్కెట్‌లో చింతపండు కొరతకు దోహదపడింది, తద్వారా దాని ధర పెరిగింది. ప్రస్తుతం కిలో రూ.100కి పైగా పలుకుతున్న టమోటాలకు ప్రత్యామ్నాయంగా చింతపండును ఉపయోగించడం కూడా ధర పెరుగుదలకు దోహదపడుతోంది.

ఇది కూడా చదవండి..

రైతులకు గుడ్ న్యూస్! ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ప్రభుత్వం 258 కోట్ల నిధులు విడుదల

ఫలితంగా చింతపండుకు డిమాండ్‌ పెరగడంతో మార్కెట్‌ విలువ పెరిగింది. తుమకూరు ఏపీఎంసీలో హోల్‌సేల్ వ్యాపారులు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ నెలలో డిమాండ్ 40 శాతం పెరిగిందని తెలిపారు. అధిక సీజన్‌లో రోజుకు సగటున 260 నుంచి 300 క్వింటాళ్ల వరకు చింతపండు కొనుగోలు జరుగుతుందని అంచనా. అయితే, ప్రస్తుత కొరత మరియు అధిక డిమాండ్‌తో, చింతపండు లభ్యత పరిమితంగా మారింది, దాని ధర మరింత పెరిగింది. రెండు నెలల క్రితం చిల్లర మార్కెట్‌లో చింతపండు కిలో రూ.80 నుంచి రూ.100 వరకు పలికింది. అయితే ప్రస్తుతం చింతపండు కిలో రూ.120 నుంచి రూ.200 వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

చింతపండు సాగులో మొదటి ఐదు రాష్ట్రాల్లో కర్ణాటక ముందుంది. కర్ణాటక తరువాత, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు చింతపండు ఉత్పత్తి శ్రేణిలో ఆయా స్థానాలను కలిగి ఉన్నాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో శీతల గిడ్డంగులు ఉన్నాయి. అక్కడ వ్యాపారులు పెద్ద మొత్తంలో చింతపండును నిల్వచేసి ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పుడు విక్రయిస్తారు. ప్రస్తుత ధరల పెరుగుదలకు ఇది ఒక కారణమని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఇది కూడా చదవండి..

రైతులకు గుడ్ న్యూస్! ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద ప్రభుత్వం 258 కోట్ల నిధులు విడుదల

Related Topics

ginger price hike

Share your comments

Subscribe Magazine