News

ఆంధ్రప్రదేశ్ సబ్సిడీ టమాటాలు పొందాలంటే ఇక నుంచి ఆధార్ కార్డు తప్పనిసరి..

Gokavarapu siva
Gokavarapu siva

టమాటో లేనిది కూర ఎలా వండాలి అని ఆలోచించే స్థాయికి టమాటో మరియు మనుషులకు బంధం ఏర్పడింది .. పెరిగిన ధరలతో ఇప్పుడు వంటగదిలో టొమాటోలు కనిపించకుండా పోతున్నాయి. ధరలు పెరిగి నేల అయిన టమాటో ధరలు దిగి రాలేదు ఇప్పుడైనా కొత్త టొమాటోలు మార్కెట్ లోకి వచ్చి ధరలు తగ్గుతాయని భావించిన రెండు రాష్ట్రాలలో కురిసిన వర్షాలకు ధరలు ఇప్పుడే తగ్గే అవకాశాలు లేవని తెలుస్తుంది.

దేశవ్యాప్తంగా టమోటా రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో టమోటా కు రెక్కలు వచ్చాయి. రైతులు పంటను కాపాడుకోవడానికి పోలీసులను, సెక్యూరీటిని కాపాలా పెట్టుకుంటున్నారు దానితోపాటు సీసీ కెమోరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు ప్రస్తుతం చిరుతపులి వేగాన్ని మించిపోతున్నాయి. అనేక ప్రాంతాలలో, ఒక కిలోగ్రాము టొమాటో ఇప్పుడు భారీ ధర రూ. 130 నుండి 150 వరకు పలుకుతుంది. రైతు బజార్లలో టమాటా కొనుగోలు చేయాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి అని సమాచారం.

రైతు బజార్లలో ఆధార్ తప్పనిసరి అని బోర్డు కూడా పెట్టారు. అది కూడా ఒక కార్డుకి కేవలం ఒక కేజీ మాత్రమే అని పెట్టారు. ఈ రోజు లేదా భవిష్యత్తులో ఏ పని ఉన్నా, ఆధార్ కార్డు కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది. పాన్ కార్డులు మరియు బ్యాంకు ఖాతాలతో ఆధార్ కార్డులను లింక్ చేయవలసిన అవసరం సార్వత్రికమైనది.

ఇది కూడా చదవండి..

ఆంధ్రప్రదేశ్ లో "రేషన్ కార్డ్" కలిగి ఉన్న ప్రజలకు ముఖ్య ప్రకటన..

విశాఖలో వివిధ రైతుబజార్లలో కొనుగోలు చేసే వినియోగదారులు తమ ఆధార్ కార్డులను పట్టుకుని వెళ్లడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఒక కిలోగ్రాము టొమాటో కొనుగోలు చేయాలంటే, వారి ఆధార్ కార్డును అందించాలి. లేదంటే వంద రూపాయలు పెట్టి మార్కెట్లో కిలో తెచ్చుకోవాల్సిందే. బయట మార్కెట్లో అయితే టమాటా రెండొందలు కూడా ఉంది. అందుకే రైతుబజార్లకే జనం పరుగులు తీస్తున్నారు.

ఎంవీపీ, సీతమ్మధార, నరసింహనగర్ రైతు బజార్లులోనే ఎక్కువగా వినియోగదారుల తాకిడి కనిపిస్తుంది. ఇక టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ రైతుబజార్లు సామాన్యుడికి ఓపెద్ద రిలీఫ్ ను ఇచ్చాయి. దీంతో ఇక్కడికి వచ్చి టమాటాను 50 రూపాయలకు పొందవచ్చు. రైతుబజార్ల కి వెళ్తే ఇప్పుడు కచ్చితంగా ఆధార్ కార్డు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆధార్ లేకపోతే రేషన్ కార్డు అయినా తీసుకొని వెళ్ళాలి. అలా చేయకపోతే సబ్సిడీ టమాటా ఇవ్వరు.

ఇది కూడా చదవండి..

ఆంధ్రప్రదేశ్ లో "రేషన్ కార్డ్" కలిగి ఉన్న ప్రజలకు ముఖ్య ప్రకటన..

Related Topics

tomato prices

Share your comments

Subscribe Magazine