News

దయనీయ స్థితిలో ఆఫ్ఘనిస్తాన్ జర్నలిస్ట్

S Vinay
S Vinay

మూసా మొహమ్మదీ అనే జర్నలిస్ట్ ఆఫ్ఘనిస్తాన్ మీడియాలో సంవత్సరాల తరబడి పనిచేశాడు, అయితే ఆఫ్ఘనిస్తాన్ యొక్క తీవ్రమైన ఆర్థిక పరిస్థితి కారణంగా, తన కుటుంబ పోషణకై అతను ఇప్పుడు వీధుల్లో చిరు తిళ్ళు అమ్ముతున్నాడు.

ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్‌లు తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుండి ఆ దేశ ప్రజలు ఆర్థిక మరియు రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. కబీర్ హక్మల్ ఇటీవలి ట్విట్టర్లో చేసిన పోస్ట్, ఆ దేశంలో ఎంత మంది ప్రతిభావంతులైన నిపుణులు పేదరికంలోకి వెళ్లారో తెలుపుతుంది.అక్కడి అందరి జీవితాలు తలకిందులయ్యాయి.

ఆఫ్ఘనిస్తాన్ లో ప్రభుత్వ పాలన ఉన్న సమయంలో మూసా మొహమ్మదీ గొప్ప న్యూస్ యాంకర్, జర్నలిస్టుగా అనేక ఛానెళ్లలో యాంకర్, రిపోర్టర్ గా చాలా సంవత్సరాలు పనిచేశాడు. తాలిబన్ల రాకతో ఇప్పుడు అతని పరిస్థితి దయనీయ స్థితికి చేరుకుంది.ఇప్పుడు అతను కుటుంబాన్ని పోషించుకోవడానికి వీధుల్లో చిరు తిళ్ళు అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయం అంతర్జాలం లో వైరల్ గా మారింది. అయితే ఆయనకీ ఊరటనిచ్చే విషయం ఏంటంటే ఈ విషయం నేషనల్ రేడియో, టెలివిజన్ డైరెక్టర్ జనరల్ అహ్మదుల్లా వాసిక్ దృష్టికి వచ్చింది. తన డిపార్ట్ మెంట్ లో మొహమ్మదీని నియమిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

తాలిబన్ల పాలనతో స్త్రీలు వంటింటికే పరిమితమయ్యారు బయటకు వెళ్లాలంటే భర్త లేక ఎవరైనా బంధువులు తోడు ఉండాలి లేదంటే తాలిబన్ల శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ప్రస్తుతం దేశం మానవతా మరియు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వారు మీడియా సంస్థలపై కూడా విరుచుకుపడ్డారు, గత కొన్ని నెలలుగా అనేక మంది జర్నలిస్టులు, ముఖ్యంగా మహిళలు ఉద్యోగాలు కోల్పోతున్నారు.మరి కొంత మంది జీవనాన్ని కొనసాగించడానికి ఏకంగా పిల్లల్ని అమ్ముకుంటున్నారు.

మరిన్ని చదవండి.

రాళ్ళలో పెరుగుదల ఉంటుందా?

గాడిద పాలతో నెలకి అక్షరాలా ₹6 లక్షల సంపాదన!

Share your comments

Subscribe Magazine