News

రానున్న రెండు రోజులు భారీ వర్షాలు ... వాతావరణశాఖ హెచ్చరికలు జారీ !

Srikanth B
Srikanth B
రెండు రోజులు భారీ వర్షాలు ... వాతావరణశాఖ హెచ్చరికలు జారీ !
రెండు రోజులు భారీ వర్షాలు ... వాతావరణశాఖ హెచ్చరికలు జారీ !

రానున్న రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది . రాష్ట్ర వ్యాప్తంగా గురు, శుక్ర వారాలలో గంటకు 30-40 కిలోమీటర్ల ఈదురుగాలులు వీస్తాయని , ఉరుములు ,మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది . మరోవైపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మూడు రోజులపాటు 39 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా తెలిపింది దీనితో రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో భిన్న వాతావరణం ఏర్పడే అవకాశం వుంది .

మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురవగా , మరికొన్ని ప్రాంతాలలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి . నిన్నజూలపల్లి, మంచిర్యాల అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది . కొమురంభీం జిల్లా సిర్పూరు, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట బెల్లంపల్లి, జైపూర్, జగిత్యాల జిల్లా పెగడపల్లి, లో 5 సెంటీమీటర్ ల వర్షపాతం నమోదయ్యింది .

జులై లో రైతుబంధు .. కొత్త దరఖాస్తు వల్ల ఆలస్యం ..!

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇలా ..

ఇక నిర్మల్‌ జిల్లా తానూరులో 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా భైంసా, ఆదిలాబాద్‌ జిల్లా పిప్పలధరిలలో 41.2, అర్లిలో 40.9 డిగ్రీలు, కామారెడ్డి జిల్లా బోమన్‌దేవిపల్లిలో 40.1, నిజామాబాద్‌ జిల్లా మాచిప్పలో 40, కల్‌దుర్కి జిల్లలో 40 డిగ్రీలకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి .

జులై లో రైతుబంధు .. కొత్త దరఖాస్తు వల్ల ఆలస్యం ..!

Related Topics

Heavy Rain Alert

Share your comments

Subscribe Magazine