News

ఆ ఒక్క సంఘటన ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ కు దారి తీసింది| "స్టోరీస్ ఆన్ వీల్స్"

KJ Staff
KJ Staff
Stories on wheels by Ananya polasani
Stories on wheels by Ananya polasani

పుస్తక పఠనం అనేది ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాల్సిన అలవాటు అందుకే దాని గురించి పిల్లల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా, ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ను మొదలుపెట్టింది , అనన్య పోల్సాని అనే హైస్కూల్ విద్యార్థిని. దాని పేరే - స్టోరీస్ ఆన్ వీల్స్, ఈ నడిచే లైబ్రరీ ఇప్పుడు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ మొబైల్ లైబ్రరీలో వివిధ రకాల పుస్తకాలు ఉన్నాయి, వీటిని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మొబైల్ లైబ్రరీ సందర్శించినప్పుడు యాక్సెస్ చేయవచ్చు.

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలోని కొదురుపాక అనే గ్రామానికి తన అమ్మమ్మతాతల వద్దకు ఒక చిన్న విహారయాత్రకు వెళ్ళింది.అనన్య తాతగారు అక్కడ ఉన్న సమయంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలని సూచించారు. అక్కడ విద్యార్థులను వారి అవసరాలను గమనించడమే ,అనన్య పోల్సాని కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను చేపట్టడానికి ప్రేరేపించింది. ఊరు నుండి తిరిగి వస్తున్న సమయంలో తిరిగి గ్రామీణ విద్యార్థులకు అవసరమైన వనరులతో సహాయం చేయాదానికి ఈ ఆలోచన తట్టింది.

విద్యార్థులు మరియు ఉపాధ్యాయ సిబ్బందితో పరస్పర చర్చను అనుసరించి , విద్యార్థుల ప్రస్తుత సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి చాలా చేయవచ్చని ఆమె భావించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు పట్టణ పాఠశాల నేపథ్యం నుండి వచ్చిన విద్యార్థులతో సమానంగా ఉన్నారు. వారు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు మరియు చాలా ఆకాంక్షలు కలిగి ఉన్నారు. ఇది ఆమెను అనేక విధాలుగా ఆలోచించేలా చేసింది మరియు వారికి ప్రయోజనం కలిగించే ఏదైనా పని చేయాలనే బలమైన భావనను రేకెత్తించింది. పాఠశాల మొత్తం సౌకర్యాలకు పుష్ అవసరమని అనన్య గమనించింది.

తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఆమె మదిలో ఓ ఆలోచన మెదిలింది. ఈ వనరులు అవసరమైన అనేక పాఠశాలలు ఉన్నందున, గ్రామీణ ప్రాంతాల్లోని అనేక పాఠశాలలను కవర్ చేయగల మొబైల్ లైబ్రరీని మొదలుపెట్టాలని ఆమె భావించింది. ఆమె దాతల నుండి అంబులెన్స్, పుస్తకాలు మరియు క్రీడా సామగ్రిని మరియు కొన్ని టెక్ కంపెనీల నుండి ఇంటర్నెట్ కనెక్టివిటీతో కూడిన ల్యాప్‌టాప్‌లను సేకరించగలిగింది .

విద్యార్థులు ఒకే పైకప్పు క్రింద క్రీడలు, సాహిత్య కార్యకలాపాలు మరియు ఇ-లెర్నింగ్ వంటి ఇతర ఆసక్తులను కొనసాగించడంలో సహాయపడే అవసరమైన వనరులను అందించడం అనన్య లక్ష్యంగా పెట్టుకుంది. ఆమె వ్యాన్ ఇంటీరియర్స్ మరియు ఎక్స్‌టీరియర్స్ కోసం "మిలాప్" అనే థర్డ్-పార్టీ వెబ్‌సైట్ ద్వారా క్రౌడ్ ఫండింగ్ చేసింది. ఈ వ్యాన్ వెయ్యి పుస్తకాల సేకరణతో దాదాపు 1500 మంది విద్యార్థులకు సహాయం చేస్తుంది.

ఇది కుడా చదవండి

Fertilizer rates: మే నెల నుండి ఎరువుల ధరలు పెరగనున్నాయా? నిపుణుల అంచనా ఏంటి

ఈ ఆలోచనకు సంబంధించి అనన్య తన బంధువులు మరియు స్నేహితుల నుండి గొప్ప మద్దతు మరియు ప్రశంసలను అందుకుంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే ఈ అందమైన కాన్సెప్ట్‌ను మొదట విన్నప్పుడు వారు చాలా సంతోషించారు. అన్ని వనరులను క్రోడీకరించడానికి ఆమెకు ఒక సంవత్సరం పట్టింది. అనన్య నేతృత్వంలోని స్టోరీస్ ఆన్ వీల్స్ హైదరాబాద్‌లో కూడా రాబోయే వారాల్లో పుస్తక సేకరణ డ్రైవ్‌ను ప్లాన్ చేస్తోంది.

ఇది కుడా చదవండి

Fertilizer rates: మే నెల నుండి ఎరువుల ధరలు పెరగనున్నాయా? నిపుణుల అంచనా ఏంటి

image credit:  https://twitter.com/amplereachpr

 

Share your comments

Subscribe Magazine