News

ఇల్లు లేనివారికి ఇంటి పట్టాలు.. హై కోర్టు తీర్పుపైనే అందరి దృష్టి!

Srikanth B
Srikanth B

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇల్లు లేని వారికీ ఇళ్లను కేటాయిస్తూ జీవో నెం45 ను విడుదల చేసింది దీని ద్వారా అర్హులైన అభ్యర్థులందరికీ అమరావతిలో ఇంటి పట్టాలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ మోహన్​రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన 33వ C.R.D.A. అథారిటీ సమావేశంలో ఇందుకు ఆమోదం తెలిపారు.

 

అమరావతిలో "పేదలందరికీ ఇళ్లు" కార్యక్రమం కోసం ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ సీఎం జగన్​ జీవో జారీ చేశారు. అమరావతిలో 11వందల34.58 ఎకరాల భూమిని పేదల ఇళ్ల కోసం కేటాయింపు చేశారు. మొత్తం 20 లే అవుట్లలోని స్థలాలను గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48 వేల 218 మందికి ఇళ్లపట్టాలు ఇవ్వాలనీ నిర్ణయించారు.

ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో .. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కింద పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్​లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లకు ఆదేశించారు. ఈ ప్రతిపాదనలను సీఆర్డీయేకు అప్పగించాలని ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడో విడత కింద ఇళ్లు లేని వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం జగన్​ ఆదేశించారు.

అకాల వర్షాల కారణంగా.. మూడు రాష్ట్రాల్లో 5.23 లక్షల హెక్టార్ల పంట నష్టం

 

మరో వైపు ఇళ్ల మంజూరు పై ప్రభుత్వం తెచ్చిన జీవో నెం 45 పై రైతులు లంచ్​ మోషన్​ పిటిషన్ వేశారు .. తమ భూములను ఇతరులకు కేటాయించడం పై దాఖలైన పిటిషన్ నేడు విచారణ కు రానున్నది .. దేనితో హై కోర్టు ఇచ్చే తీర్పు పై హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అకాల వర్షాల కారణంగా.. మూడు రాష్ట్రాల్లో 5.23 లక్షల హెక్టార్ల పంట నష్టం

Share your comments

Subscribe Magazine