News

ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలకు ఇబ్బందులున్నాయా? వెంటనే ఈ నెంబర్లకు కాల్ చేయండి..

Gokavarapu siva
Gokavarapu siva

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం ద్వారా వారికి ప్రయోజనం చేకూర్చేలా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చింది. మహాలక్ష్మిగా పిలువబడే ఈ చొరవ, ఎటువంటి ప్రయాణ ఖర్చులు లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశాన్ని మహిళలకు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వీటన్నింటి మధ్య, పథకం పురోగతి మరియు ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అనూహ్య తనిఖీని నిర్వహించాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)ను సోమవారం సజ్జనర్ తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన 'మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం' అమలు తీరుపై ఆయన క్షేత్ర పరిశీలన చేశారు. జేబీఎస్-ప్రజ్ఞాపూర్, జేబీఎస్-జనగామకు వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో, బాన్సువాడకు వెళ్లే ఎక్స్ ప్రెస్ బస్సులో ఉన్న మహిళా ప్రయాణికులతో మాట్లాడారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉచిత ప్రయాణ సౌకర్యంపై అభిప్రాయాలను సేకరించేందుకు మహిళా ప్రయాణికులతో సంభాషించారు. అనంతరం జేబీఎస్-వెంకట్ రెడ్డి నగర్ (రూట్ నంబర్ 18 వీ/జే) సిటీ ఆర్డినరీ బస్సులో మెట్టుగూడ వరకు ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్‌ను అందజేశారు.

ఇది కూడా చదవండి..

రైతులకు బిగ్ షాక్.. ఇకనుండి వారికి రైతుబంధు కట్ ?

మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ప్రభుత్వ చొరవ సానుకూలంగా రావడం పట్ల టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్, ఐపిఎస్ సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళల రవాణా ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి రూపొందించిన ఈ కార్యక్రమం మహిళలు, బాలికలు, విద్యార్థినులు మరియు థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఈ గొప్ప కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీని భాగస్వామిగా చేసినందుకు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

రద్దీ సమయాల్లో ప్రయాణికులు కొంత సమయనం పాటించి.. సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని, 24 గంటలు అందుబాటులో ఉండే సంస్థ కాల్ సెంటర్ నంబర్లైనా 040-69440000, 040-23450033 ఫోన్ చేసి చెప్పొచ్చన్నారు. వాటిని వెంటనే సరిదిద్దుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఇది కూడా చదవండి..

రైతులకు బిగ్ షాక్.. ఇకనుండి వారికి రైతుబంధు కట్ ?

Related Topics

free bus facility telangana

Share your comments

Subscribe Magazine