News

ఈ పుచ్చకాయలు కనుక మీరు తింటున్నట్లైతే, మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్లే....

KJ Staff
KJ Staff
Beware of Chemicals
Beware of Chemicals

ఎండ తాపానికి, వేడిక్కిని శరీరానికి చల్లదనం ఇచ్చే పళ్లలో పుచ్చకాయ ప్రధానంగా ఉంటుంది. ఈ వేసవి వేడిని తట్టుకోవడానికి ప్రజలు పుచ్చకాయని తింటారు. అధిక శాతం ఉండటం మూలాన పుచ్చకాయ తిన్న వెంటనే కడుపు నిండినట్లు అనిపిస్తుంది అంతే కాకుండా, ఎండ తాపాన్ని తట్టుకునే శక్తి లభిస్తుంది. వేసవి కాలంలో పుచ్చకాయకి గిరాకీ అధికంగా ఉంటుంది. ప్రజలు ఎర్రగా మరియు తియ్యగా ఉండే గుజ్జు ఉన్న పుచ్చకాయలను కొనడానికి ఇష్టపడతారు.

అటువంటి పుచ్చకాయలకు మార్కెట్లో ధర కూడా ఎక్కువే. దీనినే అదునుగా చేసుకున్న కొందరు వ్యాపారస్తులు, కాయల్లో కుత్రిమ రంగులను ఇంజక్షన్ ద్వారా నింపి విక్రయిస్తున్నారు. ఆలా చేస్తున్న ఎంతో మంది వ్యాపారులను, పోలీసులు అరెస్ట్ చెయ్యడం మనం తరచు పేపర్లలో, సోషల్ మీడియా లో చూస్తున్నాం. అయినా సరే అధిక లాభాలపై మోజుతో ఇప్పటికి చాల మంది వ్యాపారస్తులు ఈ కల్తీని కొనసాగుతూనే ఉన్నారు.

కుత్రిమంగా రంగులు కలిపిన పుచ్చకాయలను తినడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని FSSAI హెచ్చరిస్తుంది. ఇటువంటి కల్తీ పుచ్చకాయలను గుర్తించేందుకు FSSAI ఒక వీడియో విడుదల చేసింది.


పుచ్చకాయ లోపలి భాగం ఎర్రగా మరియు తియ్యగా ఉండేదుకు వర్తకులు ఉపయోగించే ఆర్టిఫిషల్ రంగుల్లో ఎరిత్రోసినే ప్రధానమైంది. దీనిని ఫుడ్ కలర్ గా కూడా వినియోగిస్తారు. ఈ కెమికల్ చాల ప్రమాదకరమైనది, థైరాయిడ్ గ్రంధి పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. కొన్ని అధ్యనాల్లో, ఎరిత్రోసిన్ పిండం ఎదుగుదలను ప్రభావితం చేస్తుందని తేలింది. ఇన్ని ప్రమాదాలు ఉన్న ఈ రంగు కలిపిన పుచ్చకాయలను గుర్తించాడనికి, కాయని కట్ చేసి దూదిని దీని మీద ఉంచాలి, రంగు కలిపిన పుచ్చకాయ నుండి దూది రంగును పీల్చుకుని పింక్ కలర్ లోకి మారుతుంది. వీటిని తినడం మంచిది కాదు.

అంతే కాకుండా పుచ్చకాయలు పూర్తిగా అభివృద్ధి చెందకుండానే వాటిని కోసి, కార్బైడ్ అనే కెమికల్ తో కాయలను పండేలా చేస్తారు. ఈ కార్బైడ్ అనే పదార్ధం, మనిషి శరీరంపై దుష్ప్రభావాలు చూపిస్తుంది. దద్దుర్లు రావడం, తలపోటు మొదలగు లక్షణాలు కార్బైడ్ కలిపినా పుచ్చకాయలు అధికంగా తినడం ద్వారా వస్తాయి. కాయపైభాగంలో తెల్లటి పొడి వంటి పదార్ధం ఎక్కువుగా ఉంటె వాటికి కార్బైడ్ కలిపారు అని గుర్తించాలి. మామిడికాయలు ముగ్గబెట్టడానికి కూడా కార్బైడ్ తరచు వాడుతుంటారు కనుక, పళ్ళను శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే వాటిని తినాలి.

Share your comments

Subscribe Magazine