News

బ్యాంకు అకౌంట్లకు కూలి డబ్బులు .. ఆధార్ తో లింక్ చేసుకున్న వారికే

Srikanth B
Srikanth B
బ్యాంకు అకౌంట్లకు కూలి డబ్బులు .. ఆధార్ తో లింక్ చేసుకున్న వారికే
బ్యాంకు అకౌంట్లకు కూలి డబ్బులు .. ఆధార్ తో లింక్ చేసుకున్న వారికే

 

కరోనా వంటి విపత్కర పరిస్థితులలో పేద ప్రజలకు ఎంతగానో తోడ్పాటు అందించిన పథకం ఏదైనా వుందా అంటే అది కచ్చితంగా ఉపాధి హామీ పథకం మాత్రమే. ఇప్పటివరకు ఉపాధిహామీ పథకం డబ్బులను పోస్ట్ ఆఫీస్ కథ ద్వారా లేదా గ్రామ సెక్రటరి ద్వారా నేరుగా కూలీలా చేతిలో డబ్బులను చెల్లిస్తుంది అయితే ఇప్పడు ఈ విధానాన్ని స్వస్తి పలికి ఉపాధి హామీ కూలీలకు ఇక 'ఆధార్‌' ఆధారంగానే చెల్లింపులు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఇక 'ఆధార్‌’ ఆధారంగానే చెల్లింపులు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద పనిచేసే వారి తప్పనిసరి ఆధార్‌ ఆధారిత చెల్లింపుల విధానం గడువును ఆక పొడిగించబోమని కేంద్రం వెల్లడించింది. ఈ పథకం కింద పనిచేసే కూలీలు తప్పనిసరిగా ఆధార్‌ ఆధారిత చెల్లింపు విధానం (ఏబీపీఎస్‌) కింద నమోదు కావాలంటూ ఈ నెల 31 వరకు గడువు విధించింది.

రేషన్ షాపుల్లో బియ్యం తోపాటు ఉచితంగా కిలో చక్కర ఎక్కడంటే

ఈ పథకం కింద పనిచేసే వారి చేతికి డబ్బు ఇవ్వకుండా ఈ విధానంలోనే చెల్లింపులు చేస్తామని ప్రకటిస్తూ తొలుత దీనికి ఫిబ్రవరి 1 గడువుగా నిర్ణయించినప్పటికీ దానిని పలుసార్లు పొడిగిస్తూ ఆగస్టు 31గా నిర్ణయించింది.ఇప్పటికీ 1.13 కోట్ల మంది ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ లబ్ధిదారులు తమ బ్యాంక్‌ అకౌంట్లను ఆధార్‌తో అనుసంధానం చేయలేదంటూ ఇటీవల కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ పార్లమెంట్‌లో వెల్లడించారు.

రేషన్ షాపుల్లో బియ్యం తోపాటు ఉచితంగా కిలో చక్కర ఎక్కడంటే

Related Topics

MGNREGA

Share your comments

Subscribe Magazine