News

" దేశం రైతులకోసం కేంద్రం 10 లక్షల కోట్లు ఖర్చు చేసింది "- RFCL ప్రారంభోత్సవంలో ప్రధాని

Srikanth B
Srikanth B
" దేశం రైతులకోసం కేంద్రం 10 లక్షల కోట్లు ఖర్చు చేసింది "- RFCL ప్రారంభోత్సవంలో ప్రధాని
" దేశం రైతులకోసం కేంద్రం 10 లక్షల కోట్లు ఖర్చు చేసింది "- RFCL ప్రారంభోత్సవంలో ప్రధాని

రైతులకు ఎరువులు సరసమైన ధరకు అందించేందుకు ధర కల్పించేందుకు కేంద్రం 10 లక్షల కోట్లు ఖర్చు చేసిందని ప్రధాని మోదీ అన్నారు యూరియాలో 'ఆత్మనిర్భర్త' (స్వావలంబన) సాధించే దిశగా దేశంలోని ఐదు పెద్ద ఎరువుల కర్మాగారాలను సంవత్సరాల తరబడి మూత పడి ఉన్న వాటిని పునఃప్రారంభిస్తున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు.

తెలంగాణలోని రామగుండంలో కర్మాగారం RFCL జాతికి అంకితం చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ రూ.9,500 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేసిన అనంతరం మాట్లాడిన మోదీ.. రైతులకు సరసమైన ధరలకు ఎరువులు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.2.5 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేస్తుందన్నారు.

పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలకు తమ ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లకు పైగా నగదును బదిలీ చేసిందని ఆయన చెప్పారు.

ఈ ఐదు ప్లాంట్లు పూర్తి స్థాయిలో పని చేస్తే దేశానికి 60 లక్షల టన్నుల యూరియా లభిస్తుందని, దీని వల్ల దిగుమతులపై భారీగా ఆదా అవుతుందని, యూరియా సులభంగా లభ్యమవుతుందని చెప్పారు.

అనేక రకాల బ్రాండ్‌ల ఎరువులు ఉండటం వల్ల గతంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో యూరియాను ‘భారత్ యూరియా’ పేరుతో ఒకే బ్రాండ్‌తో అందుబాటులోకి తెస్తామని మోదీ చెప్పారు.

"దీని నాణ్యత మరియు ధర ఇప్పటికే నిర్ణయించబడ్డాయి. ఈ ప్రయత్నాలన్నీ మేము రైతులకు, ముఖ్యంగా చిన్న రైతుల కోసం వ్యవస్థను ఎలా సంస్కరిస్తున్నామో తెలియజేస్తున్నాయి" అని ఆయన అన్నారు.

గొర్రె వెంట్రుకలతో శాలువాలు తయారీ ..ఎక్కడో తెలుసా !

RFCL( రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడే ) ఎలా మొదలయింది ?

1961 లో కేంద్ర రసాయన మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తం గ నెలకొన్న ఎరువుల కొరతను అధిగమించాలని ,
ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (FCIL) సింద్రీ (జార్ఖండ్), తాల్చేర్ (ఒడిశా), రామగుండం (తెలంగాణ), గోరఖ్‌పూర్ (UP) & కోర్బా (ఛత్తీస్‌గఢ్)లో ఐదు యూనిట్ల లను నెలకొల్పి వీటి ద్వారా ఎరువుల ఉత్పత్తిని ప్రారంభించాలిని వీటిని నెలకొల్పింది . దాదాపు ప్రారంభించిన 10 సంవత్సరాల తరువాత అందుబాతులోకి వచ్చిన కర్మాగారాలు అనేక టెక్నికల్ లోపాలతో అనుకున్న విధంగ ఉత్పత్తిని సాధించలేక పోయాయి దీనితో 1992 నుంచి నా 2002 వరకు ఆర్థిక ఇబ్బందుల మధ్య 2002 లో ఇవి మూతపడ్డాయి. అయితే 2010 వ సంవత్సరం లో ఈ అప్పులను ప్రభుత్వం మాఫీ చేస్తూ 2010 తరువాత వీటి పునరుద్ధరణకు కేంద్రం ఆమోదం తెలిపింది . 2020 నాటికీ పునరుద్ధరణ పూర్తయిన RFCL( రామగుండం ఫర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడే ) తిరిగి ప్రారంభమయి ఎరువుల ఉత్పత్తిని సాగిస్తుంది .

గొర్రె వెంట్రుకలతో శాలువాలు తయారీ ..ఎక్కడో తెలుసా !

Related Topics

Prime Minister RFCL

Share your comments

Subscribe Magazine

More on News

More