News

తెలంగాణలో కాంగ్రెస్ మరియు సీపీఐ పొత్తు ఖరారు.. ఎన్ని సీట్లు కేటాయింపు అంటే?

Gokavarapu siva
Gokavarapu siva

సీపీఐ పార్టీతో పొత్తును ఖరారు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ తాజాగా కీలక నిర్ణయానికి వచ్చింది. ఈ పొత్తులో భాగంగా సీపీఐ పార్టీకి రెండు సీట్లు కేటాయించినట్లు హైకమాండ్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో సీపీఐ పోటీ చేయనున్న చెన్నూరు, కొత్తగూడెం టికెట్ల కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం సీపీఎం నేతలతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ చర్చలు సఫలమైతే సీపీఎం పార్టీకి రెండు స్థానాలు కేటాయించి అధికారిక ప్రకటన వెలువడనుంది. కాగా, కాంగ్రెస్ పార్టీ 58 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ లిస్టును ప్రకటిస్తున్నారు. ఢిల్లీ వేదికగా కేసీ వేణుగోపాల్ సమక్షంలో కమ్యూనిస్టు పార్టీల జాతీయ నాయకులతో ఇప్పటికే భేటీ జరిగినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలపై ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. నిన్న ఉదయం 9.05 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలో మొత్తం 55 మంది అభ్యర్థులు ఉండగా, పోటీ లేని స్థానాలను ముందుగా ప్రకటిస్తారు.

ఇది కూడా చదవండి..

ఏపీలో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అదేమిటంటే?

మరో రెండు మూడు రోజుల్లో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.ఫస్ట్ లిస్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు ఉండగా.. ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం. అయితే ఇటీవలే పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడితో కలిసి అభ్యర్థుల తొలి జాబితాలో చోటు దక్కించుకోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి..

ఏపీలో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అదేమిటంటే?

Related Topics

congress cpi telangana alliance

Share your comments

Subscribe Magazine