News

కరోనా మళ్ళి విజృంభించే అవకాశం.. అప్రమత్తం చేసిన కేంద్రం

Srikanth B
Srikanth B
Covid Alert
Covid Alert

చైనాలో మళ్ళి కరోనా వైరస్ తాండవం చేస్తుంది దీనిపై చైనా ప్రభుత్వం అధికారం గ ప్రకటించనప్పటికీ సామజిక మాధ్యమాల ద్వారా వస్తున్న ఫోటోలలో హాస్పిటల్ మరియు స్మశాన వాటిక వద్ద పెద్ద మొత్తం లో క్యూ లైన్లొ కనిపించడం ప్రపంచాన్ని మళ్ళి కలవరానికి గురిచేతుంది . ప్రపంచంలో ముఖ్యంగా చైనా, కొరియా, బ్రెజిల్‌, జపాన్‌ వంటి దేశాల్లో కొవిడ్‌ అల్లకల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిందిగా కేంద్రం సూచించింది. అందుకు అనుగుణంగా ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికను రచిస్తున్నారు. గతంలో మాదిరిగా ఎయిర్‌పోర్టులో తనిఖీలకు బృందాలను పెట్టే యోచన చేస్తున్నారు.

 

దీనితో అప్రమత్తమైన భారత ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది .. కరోనా వైరస్ ఏ సమయంలో అయినా విజృభిస్తే దానికి సిద్ధముగా ఉండాలని జిల్లాధికారులను ఆదేశించింది దీనితో రాష్ట్రము లోని అన్ని జిల్లాలకుఆ ఆదేశాలు వెళ్లాయి . కరోనా వైరస్ ఒక వేళా విజృంభిస్తే గతంలో మాదిరిగా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు అనుసరించిన టెస్ట్‌, ట్రేస్‌, ట్రీట్‌మెంట్‌ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలని సూచించింది.

గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గురించి ఎప్పుడైనా విన్నారా ?

ప్రస్తుతం గ్రామీణ జిల్లాలో కొవిడ్‌ పరీక్ష గురించి పట్టించుకోవడమే లేదు. అర్బన్‌ పరిధిలో కేజీహెచ్‌తోపాటు మరో ఐదు నుంచి ఆరు అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌లో ఆ సౌకర్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను పెంచే దిశగా అధికారులు దృష్టిసారించారు.రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా జిల్లాల్లోనూ పటిష్ఠమైన చర్యలు తీసుకుని కొవిడ్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోనున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది .

 రాబోయే రోజుల్లో వైరస్‌ కొత్త వేరియెంట్ల ముప్పు పొంచి ఉండడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుక్‌ మాండవియా అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో వైద్య నిపుణులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని, కేసుల ట్రాకింగ్‌కు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. సీనియర్‌ సిటిజన్లు తప్పనిసరిగా బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలని సూచించారు. ఇక, అంతకు ముందు.. పరిస్థితి ఎలాంటిదైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం అంటూ మాండవీయా ట్వీట్‌ చేశారు.

గోల్డెన్ బ్లడ్ గ్రూప్ గురించి ఎప్పుడైనా విన్నారా ?

Share your comments

Subscribe Magazine