News

ధరణి పోర్టల్ ను రద్దు చేయాలి... కాంగ్రెస్ పార్టీ డిమాండ్ !

Srikanth B
Srikanth B

ధరణి పోర్టల్ కారణముగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ తో తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రములో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు . ధరణి పోర్టల్ వచ్చిన తరువాత రైతులందరూ అనేక ఇబ్బందులకు గురవుతున్నారని , కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని సభలలో హామీ ఇస్తూ వస్తుంది . ఇదే క్రమంలో నిన్న జరిగిన ధర్నా లో కూడా ఇదే హామీని రైతులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ .

కాంగ్రెస్ నిర్వహించిన ఈ ధర్నాలో ఆయా జిల్లాలకు చెందిన పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు . నిర్మల్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాలలలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో 24 లక్షల మందికి పట్టాలను జారీ చేస్తే ప్రభుత్వం 12. 5 లక్షల ఎకరాలను పార్ట్ B లో చేర్చడం ద్వారా రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు .

ఆంధ్రప్రదేశ్ : మిర్చి పంటలో గంజాయి సాగు..

అదేవిధముగ ధర్నా సందర్భముగా కరీంనగర్ ధర్నాలో పాల్గొన్న పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ కు ధరణి సమస్యల పరిష్కారానికి వినతి పత్రం అందించారు . మరియు రైతులకు రూ . లక్షవరకు వెంటనే రుణమాఫీ చేయాలనీ డిమాండ్ చేసారు . తెలంగాణాలో మూతపడిన షుగర్ ఫ్యాక్టరీ లను వెంటనే పునరుద్దరించాలని డిమాండ్ చేసారు . తెలంగాణ వ్యాప్తముగా నిర్వహించిన ఈ ధర్నా లో రాష్ట్రవ్యాప్తముగ కాంగ్రెస్ శ్రేణులు మరియు రైతులు పాల్గొన్నారు .

ఆంధ్రప్రదేశ్ : మిర్చి పంటలో గంజాయి సాగు..

Related Topics

Dharani portal agri loan

Share your comments

Subscribe Magazine