News

వ్యవసాయానికి సాంకేతిక జోడింపు, రైతుల ఆదాయం రెట్టింపు.

S Vinay
S Vinay

సాంకేతిక పరిజ్ఞానం సమాజంలోని అన్ని రంగాలను మెరుగుపరుస్తున్నాయి. కమ్యూనికేషన్లు, బ్యాంకింగ్, రవాణా
ఆరోగ్య సంరక్షణ వంటి వ్యవస్థలు గణనీయంగా ప్రయోజనం పొందుతున్నాయి ఇప్పుడిప్పుడే వ్యవసాయ రంగం సాంకేతిక పరిజ్ఞాన పరిమళాలు అందుకుంటుంది.
కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం వ్యవసాయానికి సాంకేతికతను అనుసంధానం చేస్తూ వినూత్న విధానాలను తీసుకువస్తుంది దీని కొరకై డిపార్ట్‌మెంట్ ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది, ఇది “ఇండియా డిజిటల్ ఎకోసిస్టమ్ ఆఫ్ అగ్రికల్చర్ (IDEA) నివేదికను ఖరారు చేసే ప్రక్రియలో ఉంది.

ఈ టాస్క్ ఫోర్స్, వ్యవసాయ నిపుణులు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు) మరియు సాధారణ ప్రజలు సూచనలను ఇవ్వడానికి ఆహ్వానించింది , వాటిని పరిగణనలోకి తీసుకొని వాటి ఆధారంగా డిపార్ట్‌మెంట్ దేశంలో అగ్రిస్టాక్‌ను రూపొందించడానికి ఒక ప్రణాలికని ఖరారు చేసింది ఇది దేశంలో వ్యవసాయ-కేంద్రీకృత పరిష్కారాలను రూపొందించడానికి ఒక పునాదిగా ఉపయోగపడుతుంది. తద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడానికి మరియు వ్యవసాయ ఉత్పాదకతని మెరుగుపరచడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.
అసలు ఏంటి ఈ India Digital Ecosystem for Agriculture(IDEA ):
ఇది రైతులకి, వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ పరపతిని పెంచడానికి అదే సమయానికి వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకతని పెంపొందించడానికి దోహదపడుతుంది. ఇందులోని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం.

ఇది దేశంలోని అన్ని ప్రాంతాల రైతులని కలుపుతూ 'సూపర్ ఆధార్' అనే జాతీయ రైతుల డేటాబేస్‌ను పొందుపరుస్తుంది. ఇందులో రైతుల పొలాలు,వాటి భూసార పరిస్థితి , పండిస్తున్న పంటలు వాటి దిగుబడి వంటి సమాచారం ఉంటుంది. అంతే కాకుండా ఇది PM కిసాన్, సాయిల్ హెల్త్ కార్డ్‌లు, జాతీయ పంటల బీమా పథకం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన వంటి అమలులో ఉన్న పథకాల తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. ప్రతి రైతుని అగ్రిస్టాక్ తో అనుసంధానం చేస్తుంది.

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యాన్ని సాధించేందుకు 'అగ్రిస్టాక్' కచ్చితంగా దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని చదవండి.

పంట వ్యర్థాలను దహించకుండా ఫలవంతగా వాడుకుందాం ఇలా

 

Share your comments

Subscribe Magazine