News

డా. బి .ఆర్ అంబెడ్కర్ వర్ధంతి : డా. బి .ఆర్ అంబెడ్కర్ జీవితం మనకు ఏం సూచిస్తుంది !

Srikanth B
Srikanth B

మహనీయుడు భారత రాజ్యాంగ పీతమహుడు బడుగు బలహీనవర్గ జాతుల శ్రేయస్సు కోసం అనునిత్యం తపించిన డా. బి .ఆర్ అంబెడ్కర్ 1891 ఏప్రిల్ 14 న మద్యప్రదేశ్ లోని , మహౌ ప్రాంతం లో జన్మించాడు . అంటరాని తనం మరియు బడుగు బలహీనవర్గల శ్రేయషు కోసం పోరాడి వారికీ హక్కులను కల్పిస్తూ 1950 లో భారత దేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారు.

రాజ్యాంగాని భారత జాతికి అందించి నేటికీ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అయన కలలు కన్నా అంటరాని తనం కుల వివక్ష లేని రాజ్యాన్ని మనము ఇప్పటి వరకు రూపొందించుకోలేక పోయాం . లోపం ఎక్కడున్నది పాలించే పాలకుల లోన లేదా ఓటు హక్కు కల్పించిన పాలకులను ఎన్నుకునే పౌరులలోన అనేది మనల్ని మనం ప్రశ్నించులోవాలి .


దీనిపై అక్షరాస్యత ప్రభావం ఎంత ?

చీమలు ఏ విధముగా నైతే ఐక్యమత్యం తో పని చేసే పుట్ట ను నిర్మిస్తాయో ,ఐక్యమత్యం అనేది అంతే బలమైన దేశాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది . ఈ ఐక్యమత్యం కేవలం విద్య ద్వారానే సాధ్యపడుతుందని అని డా. బి .ఆర్ అంబెడ్కర్ అన్నారు . అయితే ఆ ఐక్యత కల్గిన విద్యను అందించడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయి .

డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్!

దేశానికి స్వతంత్రం వచ్చే నాటికీ దేశ సగటు అక్షరాస్యత 16. 2 శాతం ఉండగా గిరిజనుల అక్షరాస్యత 9 శాతానికి ఉంది . మనకంటే రెండు సంవత్సరాల తరువాత స్వతంత్రం పొందిన చైనా లో స్వతంత్రానికి ముందు అక్షరాస్యత కేవలం 1950 వరకు 20 శాతం ఉండగా నేడు 99. 83 శాతం అక్షరాస్యత సాధించింది . అయితే భారత దేశ సగటు అక్షరాస్యత మాత్రం 73 శాతం , దళితులు మరియు గిరిజనుల అక్షరాస్యత 59 శాతం గ మాత్రమే ఉంది . స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన కేవలం దళితులకు ,గిరిజనులకు ఓటు బ్యాంకు పొందడానికి పథకాలను అందించడం తో నే సరి పెట్టు కుంటుంది. పథకాలకు పరిమితి చేయకుండా నాణ్యమైన విద్యను అక్షరాస్యత ను పొందినపుడు మాత్రమే బలమైన దేశం నిర్మించబడుతుంది .

డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్!

Related Topics

Dr. BR Ambedkar

Share your comments

Subscribe Magazine