News

'సూర్య నమస్కారం- శాస్త్రీయత' పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్

Srikanth B
Srikanth B


'సూర్య నమస్కారం- శాస్త్రీయత' పేరిట రూపొందిన ఒక పుస్తకాన్ని కేంద్ర ఆయుష్, మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ ఆవిష్కరించారు. వివిధ యోగాసనాలకు సంబంధించి శాస్త్రీయ పద్దతిలో సేకరించిన సమాచారాన్ని పుస్తకం లో పొందుపరిచారు.ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆయుర్వేదలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐఐఏ డైరెక్టర్ ప్రొఫెసర్ తనూజా మనోజ్ నేసరి, ఇన్‌స్టిట్యూట్ డీన్‌లు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.

పాకిస్థాన్ లో కిలో టమాటా రూ . 500 భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే అవకాశం !

సంస్థలో 2022 ఆగస్టు 22 నుంచి 27 వరకు జరిగిన కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (CME) ప్రోగ్రాం 2022 కార్యక్రమ నిర్వాహకులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యూఢిల్లీకి చెందిన రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం తో కలిసి స్వస్థవృత్తా, ద్రవ్యగుణ, పంచకర్మ విభాగాలు కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆయుర్వేద కి చెందిన స్వస్థవృత్తా, యోగ విభాగాలు 'సూర్య నమస్కారం- శాస్త్రీయత' పుస్తకాన్ని రూపొందించాయి. 'సూర్య నమస్కారం- శాస్త్రీయత' పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి భారతీయ సంప్రదాయాలు, అభ్యాసాలను శాస్త్రీయ విధానాల ద్వారా ప్రచారం కల్పిస్తున్నఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఆయుర్వేద సిబ్బంది, పరిశోధకులను అభినందించారు.

పాకిస్థాన్ లో కిలో టమాటా రూ . 500 భారతదేశం నుంచి దిగుమతి చేసుకునే అవకాశం !

Share your comments

Subscribe Magazine