News

FACT CHECK :పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన ... 50 శాతం సబ్సిడీ పై ట్రాక్టర్ వార్తలో నిజమెంత ?

Srikanth B
Srikanth B
FACT CHECK :పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన ... 50 శాతం సబ్సిడీ పై ట్రాక్టర్ వార్తలో నిజమెంత ?
FACT CHECK :పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన ... 50 శాతం సబ్సిడీ పై ట్రాక్టర్ వార్తలో నిజమెంత ?

రైతులకు తక్కువ ధరకు వ్యవసాయ పనిముట్లను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా, రైతులు ట్రాక్టర్‌ను 50 శాతం తక్కువ ధరకు (సబ్సిడీ) కొనుగోలు చేయవచ్చు. ప్రతి చిన్న మరియు సన్నకారు రైతు ప్రధాన మంత్రి ట్రాక్టర్ యోజన పథకానికి అర్హులు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే రైతు వయస్సు 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. సొంత పొలం లేకపోయినా పర్వాలేదు.. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. కౌలు రైతులు.. యజమాని నుంచి ఎన్ ఓసీ తీసుకోవాలి.

పీఎం ట్రాక్టర్ పథకానికి దరఖాస్తు చేసుకునే రైతు కుటుంబ వార్షికాదాయం రూ.1.50 లక్షలకు మించకూడదు. దరఖాస్తు చేసుకున్న రైతు అర్హులైతే సగం రేటుకు ట్రాక్టర్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ట్రాక్టర్ ధరలో సగం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తోంది అంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో చాల మీడియా కధనాలు ప్రచురితమవుతున్నాయి అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది మనం ఇక్కడ చూద్దాం.

50 శాతం సబ్సిడీ పై ట్రాక్టర్ వార్తలో నిజమెంత ?

వాస్తవానికి రైతులకు అతిముఖ్యమైన వ్యవసాయ యంత్రం ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా ట్రాక్టర్ మాత్రమే ..అందుకు దీనిని అదనుగా భావించిన కొందరు ఫేక్ వెబ్సైటు లు మరియు ఫేక్ న్యూస్ రాస్తూ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు అయితే వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పథకాలను అమలుచేయడం లేదని PIB ఫ్యాక్ట్ చెక్ ద్వారా రైతులకు తెలియజేసింది . 50 శాతం సబ్సిడీ పై ట్రాక్టర్ వార్తలు పచ్చి అబద్ధం అని రైతు ఈ కథనాలను చూసి మోసపోవద్దని సూచించింది .

Related Topics

PMKISANSAMANNIDI

Share your comments

Subscribe Magazine