News

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన గ్యాస్ ధరలు.. ఎంతంటే?

Gokavarapu siva
Gokavarapu siva

దేశంలో ప్రతినెల మొదటి తారీఖున గ్యాస్ సీలిండర్ ధరలు మారుతూ ఉంటాయి. నవంబర్ నెల ముగిసి డిసెంబర్ నెల ప్రారంభమైంది. డిసెంబర్ మెుదటి తారీఖున ఎప్పటి మాదిరిగానే దేశంలోని చమురు కంపెనీలు గ్యాస్ ధరలను మార్చాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ద్రవ్యోల్బణ సమయంలో ప్రజలపై మరింత భారం పడే ప్రకటన వెలువడింది.

దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన తర్వాత, గ్యాస్ ధరలలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. పర్యవసానంగా, వ్యాపారులు విస్తృతంగా ఉపయోగించే 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలను మరింత పెంచాలని ప్రధాన చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా సవరించిన ధరలు త్వరలో అమలులోకి రానున్నాయని గ్యాస్ పంపిణీ సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.

గత కొద్ది రోజుల క్రితం అంటే నవంబర్ 16న ఛత్ పండుగ సందర్భంగా కమర్షియల్ సిలిండర్ల ధరలను రూ.50 తగ్గించడం గమనార్హం. అయితే, తాజా ప్రకటన సిలిండర్‌పై ఊహించని మరియు నిరుత్సాహకరంగా రూ.21 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఇటీవల 19 కిలోల గ్యాస్ సిలిండర్ల ధర మార్పులను పరిశీలిస్తే, ధర మారుతున్నట్లు మనం గమనించవచ్చు.

దేశ రాజధాని దిల్లీలో రూ.1,796.50గా ఉండగా.. కోల్‌కతాలో రూ.1,908 వద్ద విక్రయించబడుతున్నాయి. ఇదే క్రమంలో ముంబైలో కమర్షియల్ సిలిండర్ పెరిగిన ధర రూ.1,749గా ఉండగా.. చెన్నైలో అత్యధికంగా రూ.1,968.50గా కొనసాగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన తాజా ధరలను పరిశీలిస్తే.. హైదరాబాదులో 19 కిలోల సిలిండర్ రేటు రూ.2,002గా ఉంది.

ఇది కూడా చదవండి..

ఐఎండీ హెచ్చరిక.! ఏపీకి తుఫాను ముప్పు.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

ఇదే క్రమంలో గృహ వినియోగదారుల 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. దేశంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సామాన్య ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించి, వారి ఆదరాభిమానాలు పొందేందుకు ప్రభుత్వం ఈ ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటోంది.

దీపావళి సమయంలో భారీగా ఒక్కో సిలిండర్ ధరను తగ్గిస్తూ దేశ ప్రజలకు ఉపసమనం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే ఢిల్లీలో రూ.903, కోల్‌కతాలో రూ.929, ముంబైలో రూ.902.50, చెన్నైలో రూ.918.50కి ఈ సిలిండర్లను విక్రయిస్తున్నట్లు గమనించవచ్చు.

ఇది కూడా చదవండి..

ఐఎండీ హెచ్చరిక.! ఏపీకి తుఫాను ముప్పు.. నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు

Share your comments

Subscribe Magazine