News

రైతులకు శుభవార్త.. వచ్చే నెలలోనే పీఎం కిసాన్ యోజన 15వ విడత డబ్బులు జమ..!

Gokavarapu siva
Gokavarapu siva

దేశంలోని రైతుల ఆర్థిక సహాయం కోసం భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ప్రతి ఏటా 6 వేల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలకు వాయిదాల్లో వేస్తున్నారు. ఈ పథకం ప్రకారం, ప్రభుత్వం ప్రతి 4 నెలల వ్యవధిలో 3 విడతలుగా రైతుల ఖాతాలకు రూ.2,000 జమ చేస్తున్నారు. 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 14 వాయిదాలను రైతుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది. ప్రస్తుతం 15వ విడత ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురు చూస్తున్నారు.

దేశంలోని రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి భారత ప్రభుత్వం పెద్ద నవీకరణను అందించింది. నిజానికి, పీఎం కిసాన్ 15వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు పెద్ద ఊరట లభించింది. పీఎం కిసాన్ యోజన 15వ విడత వచ్చే నెలలో విడుదల కావచ్చని చెబుతున్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద, దేశంలోని ఆర్థికంగా బలహీనంగా ఉన్న రైతుల ఖాతాలకు ప్రతి సంవత్సరం 6 వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని మూడు విడతలుగా ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున ఏడాదికి మూడుసార్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.

మీరు కూడా PM కిసాన్ యోజన యొక్క 15వ విడత కోసం ఎదురు చూస్తున్నట్లయితే, మీ నిరీక్షణ ఇప్పుడు ముగిసినట్టే. కాబట్టి వచ్చే నెలలో ఏ రోజున పీఎం కిసాన్ యోజన 15వ విడత రైతుల ఖాతాలకు బదిలీ చేయబడుతుందో ఇంకా స్పష్టంగా చెప్పలేదు. నవంబర్ మొదటి వారంలోగా రైతుల ఖాతాల్లోకి జమచేయవచ్చు.

ప్రస్తుతానికి, ఈ పథకం ప్రయోజనం పొందుతున్న రైతులకు బ్యాంక్ ఖాతా యొక్క ఆధార్ సీడింగ్‌తో పాటు ఇ-కెవైసి చేయాలని భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎం కిసాన్ 15వ విడత పొందేందుకు రైతులు తమ బ్యాంకు ఖాతాల ఆధార్ సీడింగ్‌ను అక్టోబర్ 15, 2023లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చదవండి..

పండుగల సమయంలో భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంత పెరిగిందంటే..?

ఈ ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందడానికి, మీరు ముందుగా PM కిసాన్ యోజనకు సంబంధించిన KYC ప్రక్రియను సరిగ్గా పూర్తి చేయాలి. కొన్ని కారణాల వల్ల మీరు ఈ ప్రక్రియను పూర్తి చేయలేకపోతే, 15వ వాయిదాకు సంబంధించిన డబ్బు మీ ఖాతాకు రాదు. PM కిసాన్ KYC ప్రక్రియను పూర్తి చేయడానికి, మీరు పథకం యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి .

మరొకవైపు ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం సూచనలను జారీ చేసింది , తదుపరి విడత రైతు భరోసా డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమ కావాలంటే రైతులు ekyc ప్రక్రియ పూర్తి చేయాలనీ రైతులను ఆదేశించింది . లేనిపక్షంలో రైతుల ఖాతాలో తదుపరి విడత రైతు భరోసా డబ్బులు జమ కావని సూచించింది.

ఇది కూడా చదవండి..

పండుగల సమయంలో భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంత పెరిగిందంటే..?

Share your comments

Subscribe Magazine