News

రైతులకు గుడ్ న్యూస్! పంటలకు సోకే చీడపీడలు, రోగాలను గుర్తించేందుకు కొత్తగా యాప్..

Gokavarapu siva
Gokavarapu siva

రైతులకు ఎంతగానో ఉపయోగపడే ఒక కొత్త అప్లికేషన్ ను ఇక్రిసాట్‌ సంస్థ రూపొందించింది. పంటలకు సోకే తెగుళ్లు మరియు వ్యాధులను గుర్తించి, వాటిని నివారించడానికి పరిష్కారాన్ని చెప్పే ఆధునిక టెక్నాలజీని రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది ఇక్రిసాట్‌ సంస్థ. ఈ టెక్నాలజీ రైతులకు చాలా బాగా ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఈ అప్పికేషన్ తో రైతులు వెంటనే పంటకు సోకిన చీడపురుగులను గుర్తించవచ్చు.

ఈ యాప్‌ పేరు ప్రోగ్రెసివ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ అగ్రికల్చర్‌ టెక్నాలజీ (పీఈఏటీ) అని ఇక్రిసాట్‌ సంస్థ తెలిపింది. కేవలం ఒక ఫోటో తీయడంతోనే పంటకు సోకిన తెగుళ్లను లేదా వ్యాధిని కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసి, నిర్ధారిస్తుంది. ఈ అత్యాధునిక సాధనం రైతులు పంట ఆరోగ్య సమస్యలను పరిష్కరించే విధానంలో విప్లవాత్మక మార్పులు చేస్తుంది.

ఈ యాప్ రైతులకు ముందస్తుగా వ్యాధిని గుర్తించడం మరియు దానిని నివారించడానికి తగిన చికిత్స అందించే వీలును కల్పిస్తుంది. ఈ అప్లికేషన్ మొక్క యొక్క ఫోటోను క్యాప్చర్ చేయడం ద్వారా మొక్కలలోని వ్యాధులను వేగంగా గుర్తించడానికి కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తుంది. ఇది ఇక్రిసాట్‌ డాటా సెంటర్‌కు అనుసంధానమై ఉంటుంది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వస్తున్న మార్పులు, చీడపీడల తీవ్రతను విశ్లేషించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు.

ఇది కూడా చదవండి..

రుణమాఫీకి 18 వేల కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. మొదటి విడతలో 167.59 కోట్ల రుణమాఫీ!

జియోట్యాగింగ్ టెక్నాలజీ అమలుకు సంబంధించి ఇక్రిశాట్ పరిశోధకులు ఇటీవల ఒక సంచలనాత్మక ఆవిష్కరణను రూపొందించారు. జియోట్యాగింగ్‌ చేసి ఉండటం వల్ల కెమికల్‌ అండ్‌ బయోలాజికల్‌ ట్రీట్‌మెంట్‌ చేయడానికి ఆస్కారం ఉంటుందని, సులభంగా మొక్కను విశ్లేషించవచ్చని ఇక్రిసాట్‌ పరిశోధకులు వెల్లడించారు. ఇది రైతులకు తమ పంటలను ముందుగా కాపాడుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ యాప్ అనేది రైతులకు వాతావరణ సమాచారాన్ని బట్టి, కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయపడుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి..

రుణమాఫీకి 18 వేల కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. మొదటి విడతలో 167.59 కోట్ల రుణమాఫీ!

Related Topics

icrisat new application

Share your comments

Subscribe Magazine