News

రైతులకు శుభవార్త: రేపే అందుబాటులోకి సల్ఫర్ కోటెడ్ యూరియా!

Srikanth B
Srikanth B
రైతులకు శుభవార్త: రేపే అందుబాటులోకి సల్ఫర్ కోటెడ్ యూరియా!
రైతులకు శుభవార్త: రేపే అందుబాటులోకి సల్ఫర్ కోటెడ్ యూరియా!

రైతులు పంటలు సాగు చేసిన అనంతరం దృష్టి సారించే అంశం ఏదైనా వుందా అంటే అది ఎరువుల అంశమే నాట్లు వేసిన దగ్గర్నుంచి పొట్ట దశ వరకు సరైన ఎరువులను లను అందించడం ద్వారా మాత్రమే అధిక దిగుబడిని సాధించవచ్చు అయితే రైతులు అధికంగా వాడే ఎరువు యూరియా తో కలిపి సల్ఫర్ కోటెడ్ యూరియా రానుంది దీనితో రైతులు ప్రత్యేకంగా యూరియాతో పటు సల్పేర్ సూక్ష్మ పోషక ఎరువులను ఉపయోగించాల్సిన అవసరం లేదు .


రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. రేపటి నుంచి అందుబాటులోకి సల్ఫర్ కోటెడ్ యూరియా రానుంది. అలాగే..ఎరువుల రిటైల్‌ దుకాణాలు పీఎం కిసాన్ సేవా కేంద్రాలుగా మారనున్నాయి.

ఈ విషయాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. ఎరువుల రిటైల్ షాప్స్ రేపటి (27 వ తేదీ) నుంచి ప్రధాన మంత్రి కిసాన్ సేవా కేంద్రాలు గా మారుతున్నాయని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులు,ఇతర సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు..

అదేవిధంగా భారత్ బ్రాండ్ పేరుతో రేపటి నుంచి ఎరువులు అందుబాటులో ఉంటాయని రేపు ప్రధానమంత్రి రాజస్థాన్ లో 14వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను ప్రారంభించి దేశ వ్యాప్తంగా రైతులతో వర్చువల్ గా ప్రధాని మోడీ మాట్లాడుతారన్నారు కిషన్‌రెడ్డి తెలిపారు . ప్రతి నెల రెండో ఆదివారం కిసాన్ కా బాత్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దు..

Related Topics

yuriya

Share your comments

Subscribe Magazine