News

రైతులకు శుభవార్త : ఫిబ్రవరి 27 న రైతుభరోసా డబ్బులు ఖాతాలోకి ...

Srikanth B
Srikanth B

రైతులను ఆదుకొని పంట సాగును ప్రోస్తహిందడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పధకాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తాయి. ఈ వివిధ రకాల పథకాల వల్లా రైతులు ఆర్ధికంగా బలపడి పంటలను సాగు చేస్తున్నారు. దీనితో పాటు రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణి చేయడం మరియు పంటకు వాడే ఎరువులపై సబ్సిడీలను అందించడం ఈ విధంగా అనేక రకాలుగా ప్రభుత్వాలు రైతులకు అండగా నిలుస్తున్నాయి.

వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకానికి సంబంధించి ఈ ఏడాదికి ఆఖరి విడతగా రూ.2 వేల పెట్టుబడి సాయం ఈనెల 27న రైతుల ఖాతాల్లోకి జమ కానుంది.తుది విడతగా సంక్రాంతి కానుకగా రూ.2 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉండగా... ఈకేవైసీ తప్పనిసరి చేయడంతో నెల రోజులు ఆలస్యంగా ఈనెల 27న విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి రెండు విడతల కింద అనంతపురం జిల్లాకు రూ.321 కోట్లు ఇవ్వగా, ఇపుడు ఇచ్చే రూ.59.11 కోట్ల మొత్తం కలిపితే ఈ ఏడాది రూ.380 కోట్లకు పైగా లబ్ధి చేకూరినట్లు అవుతుంది.

రైతులకు శుభవార్త :ఫిబ్రవరి 27న PM కిసాన్ విడుదల .. లబ్ధిదారుల జాబితా చెక్ చేయండి ఇలా

ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో 5,52,176 మంది రైతుల ఖాతాల్లో రూ.115.66 కోట్లు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఏటా రూ.13,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500, కేంద్రం రూ.6 వేలు ఇస్తోంది. కౌలు రైతులు, అటవీ భూముల సాగుదారులు, దేవదాయ భూముల సాగుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి మొత్తం చెల్లిస్తోంది. ఇలా నాలుగో ఏడాదికి సంబంధించి ఖరీఫ్‌కు సాయంగా 2022 మేలో రూ.7,500, రబీ సాయంగా అక్టోబర్‌లో రూ.4 వేలు చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.

అలాగే మొదటి రెండు విడతల కింద శ్రీసత్యసాయి జిల్లా రైతులకు రూ.308 కోట్లకుపైగా ఇవ్వగా, ఇపుడు ఇవ్వనున్న రూ.56.55 కోట్లు మొత్తం కలిపితే రూ.365 కోట్ల వరకు ప్రయోజనం కలగనుంది. ఇలా ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ ఏడాది రూ.745 కోట్ల మేర రైతులకు భరోసా కల్పించారు.

రైతులకు శుభవార్త :ఫిబ్రవరి 27న PM కిసాన్ విడుదల .. లబ్ధిదారుల జాబితా చెక్ చేయండి ఇలా

Related Topics

pmkisan

Share your comments

Subscribe Magazine