News

రేషన్ కార్డు లబ్దిదారులకు శుభవార్త :10 కిలోల ఉచిత బియ్యం పంపిణి పొడిచే అవకాశం !

Srikanth B
Srikanth B
Garib kalyan yojana
Garib kalyan yojana

దేశ వ్యాప్తం గ పౌరులకు తెల్ల రేషన్ కార్డు మీద గత కొంత కాలం గ ఉచితం గ బియ్యం అందిస్తున్న కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని మరోఏడాది పాటు పొడిగించే అవకాశం వుండేట్లుగా సమాచారం అందుతుంది అదేవిధంగ దీనిక్రింద చాలామంది అనర్హులు లబ్దిపొందుతున్నారు అని భావించిన కేంద్ర ప్రభుత్వం వారని గుర్తించేందుకు కొత్త నిబంధనలు తీసుకువస్తుంది.

గరీబ్ కల్యాణ్ యోజన మరిన్ని నెలలు పెంపుకు అవకాశం

మీడియా నివేదికల ప్రకారం, ప్రభుత్వం ప్రస్తుతం పేదలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా అందిస్తోంది. ఈ పథకాన్ని 2023 వరకు పెంచనున్నట్లు సమాచారం.నూతన సంవత్సరంలో పీఎంజీకేఏవై పథకాన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ పథకం కింద లబ్ధిదారులకు ప్రతి నెలా 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందుతాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) కింద వారికి అత్యంత సబ్సిడీ ధరకు ఇచ్చే పరిమాణానికి ఇది అదనం.

రేషన్ కార్డుదారులకు శుభవార్త : ఇక నుంచి దేశం లో ఎక్కడినుండైనా రేషన్ బియ్యం తీసుకోవచ్చు !

కరోనా ప్రభావం నుంచి పేదలను ఆదుకునేందుకు ఏప్రిల్ 2020లో ఈ పథకాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కోసం మొత్తం 3.9 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేసింది. ఈ పథకాన్ని మార్చి 2023 వరకు పొడిగిస్తే సబ్సిడీ బిల్లుకు మరో రూ.40 వేల కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని వర్గాలు తెలిపాయి.


కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం.. జనవరి 1, 2023 వరకు సెంట్రల్ పూల్‌లో దాదాపు 159 లక్షల టన్నుల గోధుమలు అందుబాటులో ఉంటాయి. PMGKAYని మార్చి వరకు పొడిగిస్తే.. జనవరి, మార్చి 2023 మధ్య మరో 68 లక్షల టన్నుల గోధుమలను పంపిణీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఏప్రిల్ 1 వరకు ప్రభుత్వం వద్ద మొత్తం 91 లక్షల టన్నుల గోధుమలు నిల్వ ఉండనున్నాయి.

రేషన్ కార్డుదారులకు శుభవార్త : ఇక నుంచి దేశం లో ఎక్కడినుండైనా రేషన్ బియ్యం తీసుకోవచ్చు !

Share your comments

Subscribe Magazine