News

ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త: ఈ పథకాన్ని పునరుద్ధరించిన ఎస్బీఐ.. ఇప్పుడే పెట్టుబడి పెట్టండి..

Gokavarapu siva
Gokavarapu siva

ఎస్బీఐ సంస్థ తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఎస్బీఐ లో ఉన్న తమ పాత ఫిక్స్ డ్ డిపాజిట్ స్కీం అయిన `అమృత్ కలశ్` పథకాన్ని పునరుద్ధరించింది. ఎస్బీఐ `అమృత్ కలశ్` ఫథకాన్ని డిసెంబర్ నెల చివరి వరకు పొడిగించింది. ఈ పథకం తక్కువ సమాయంతో పొదుపు చేసేవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ నిజానికి ఆగష్టు 15, 2023 నాటికీ గడువు ముగిసింది. కానీ ఎస్బీఐ సంస్థ ఈ పథకాన్ని మళ్లి డిసెంబర్ 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.

ఈ అమృత్‌ కలశ్‌ ఫిక్స్ డ్ డిపాజిట్‌ స్కీమ్ 400 రోజుల గడువుతో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తోంది. 7 రోజుల నుంచి పదేళ్ల వరకు సాధారణ పౌరుల ఫిక్స్ డ్ డిపాజిట్లపై 3 నుండి 7 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే 3.5 నుండి 7.5 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.

ఈ అమృత్‌ కలశ్‌ ఫిక్స్ డ్ డిపాజిట్‌ స్కీమ్ ప్రజలకు ఏప్రిల్ 12 నుండి జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ పథకం కింద డిపాజిట్లపై ఆదాయం పన్ను చట్టం కింద టీడీఎస్ డిడక్షన్ చేస్తారు. బ్యాంకు బ్రాంచ్‌లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌, యోనో యాప్ ద్వారా ఈ స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో చేరవచ్చు.

ఇది కూడా చదవండి..

రైతులకు హైబ్రిడ్ విత్తనాలు.. వీటితో అధిక దిగుబడులు మరియు లాభాలు..

ఈ పథకంలో గరిష్టంగా ఖాతాదారులు రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ పథకం తక్కువ సమాయంతో పొదుపు చేసేవారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మన నగదును మెచ్యూరిటీ సమయానికి ముందే విత్ డ్రా చేసుకునే సౌకర్యం కూడా ఎస్బీఐ సంస్థ తమ ఖాతాదారులకు కల్పిస్తుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధ సంవత్సరం పద్ధతిలో వడ్డీ చెల్లిస్తారు. ఈ పథకం ద్వారా వినియోగదారులు రుణ సౌకర్యం కూడా పొందవచ్చు.

ఇది కూడా చదవండి..

రైతులకు హైబ్రిడ్ విత్తనాలు.. వీటితో అధిక దిగుబడులు మరియు లాభాలు..

Related Topics

SBI amruth kalash scheme

Share your comments

Subscribe Magazine