News

తెలంగాణ రైతులకు శుభవార్త .. జూన్ 20న రైతుబంధు .. స్టేటస్ చెక్ చేయండి ఇలా !

Srikanth B
Srikanth B
తెలంగాణ రైతులకు శుభవార్త .. జూన్ 20న రైతుబంధు .. స్టేటస్ చెక్ చేయండి ఇలా !
తెలంగాణ రైతులకు శుభవార్త .. జూన్ 20న రైతుబంధు .. స్టేటస్ చెక్ చేయండి ఇలా !

తెలంగాణ రైతులకు శుభవార్త అందించింది,వానాకాలం సీజన్ కు సంబందించిన రైతు బంధు ను విడుదల చేయడానికి నిధుల సమీకరణాలను ప్రారంభించింది , 7 రోజులలో నిధులను సమీకరించి రైతుబంధు నిధులను విడుదల చేయాలనీ ఆర్థిక శాఖ ను ప్రభుత్వం అద్దేశించింది , వానాకాలం సీజన్ రైతుబంధు విడుదల చేయడానికి ప్రభుత్వానికి రూ. 7,500 కోట్లు అవసరం దీనితో నిధులను సమీకరించడంలో ప్రభుత్వం నిమగ్నం అయ్యింది.వారం రోజులలో నిధులను సమీకరించి రైతుల ఖాతాలో జూన్ 20 తేదీ తరువాత విడుదల చేయాలనీ ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే కొత్త దరకాస్తు లను స్వీకారం కూడా కూడా ప్రారంభించింది , ప్రతి సంవత్సరంలో లబ్ధిదారులు సంఖ్యలో మార్పులు చేర్పులు జరుగుతుండడంతో లబ్ధిదారుల సంఖ్య మారుతూవస్తోంది గత సంవత్సరం 63లక్షల లబ్ధిదారులు ఉంటే ఈ సంవత్సరం ఈ సీజన్‌లో సుమారు 65 లక్షల మంది లబ్ధిదారుల ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఈ సంవత్సరం అంచనా ప్రకారం లబ్ధిదారులకు రూ. 7,500 కోట్లు అవసరమవుతాయని అంచనా. అంతే కాకుండా వృథా భూముల పట్టాలను త్వరలో పంపిణీ చేస్తామన్నారు. వారికి కూడా రైతుబంధు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. జూన్ 20 తర్వాత రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు.

కనీస మద్దతు ధర కోసం రోడెక్కిన రైతులు..

రైతు బంధును స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి..
1. ముందుగా https://treasury.telangana.gov.in/ link వెబ్ సైట్ కు వెళ్లాలి.
2. ఆ తర్వాత మెనూబార్ లో రైతు బందు స్కీమ్ వివరాల ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.
3. ఆ తర్వత సంవత్సరం, భూమి రకం, పీపీబీ నంబర్ ఎంటర్ చేయాలి.
4. ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
5. ఆ తర్వాత డ్రాప్ డౌన్ జాబితా నుంచి స్కీమ్ వైజ్ రిపోర్ట్ క్లిక్ చేయాలి.
6. ఆ తర్వాత మీ పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి.
7. అనంతరం సంవత్సరాన్ని ఎంచుకోవాలి.
8. పీపీబీ నంబర్ ఎంటర్ చేయాలి.
9. సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

కనీస మద్దతు ధర కోసం రోడెక్కిన రైతులు..

Related Topics

rayithubandu

Share your comments

Subscribe Magazine