News

కేంద్రం నుండి సామాన్యులకు గుడ్ న్యూస్..! రూ.400 తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు..

Gokavarapu siva
Gokavarapu siva

కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు శుభవార్త చెప్పింది. వంటగ్యాస్ ధరలను భారీగా తగ్గించనుంది కేంద్ర ప్రభుత్వం. మహిళలకు కేంద్ర ప్రభుత్వం రాఖీ, ఓనం గిఫ్ట్ అని చెబుతుంది. ఒక్కో సిలిండర్ పై ధర రూ.200 తగ్గిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు ప్రతినెల సిలిండర్ ధరలు కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈ వంటగ్యాస్ సిలిండర్ ధరలు తగ్గడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

విపక్షాలకు వంటగ్యాస్‌ ధరలు ఆయుధంగా మారాయి. అతి త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జరగబోతున్నాయి. గ్యాస్‌ ధరలు జనంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయన్న నివేదికలతో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మంగళవారం జరిగిన కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

గృహోపకరణాల LPG సిలిండర్ల ధరను రూ.200 తగ్గిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఇది రాఖీ, ఓనం పండగల సందర్భంగా మహిళలకు ప్రధాని ఇస్తున్న గిఫ్ట్ అని అన్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMYU) ఇప్పటికే కనెక్షన్లు ఉన్న అర్హులైన లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీని ఇప్పటికే ప్రభుత్వం అందిస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ ధర తగ్గింపుతో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకంలో ఉన్నవారికి ఏకంగా రూ.400 తగ్గతుంది.

ఇది కూడా చదవండి..

టీఎస్ ఆర్టీసీ విద్యార్థులకు శుభవార్త.. ఇక నుండి మొత్తం ఆన్‌లైన్‌లోనే..

ఈ కొత్త ధరల మార్పు బుధవారం నుంచి అమలు కానుంది. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.1,103గా ఉంది, అయితే ఈ తగ్గింపుతో ఇప్పుడు రూ.903కి అందుబాటులోకి రానుంది. ప్రత్యేకించి, ఉజ్వల పథకంలో భాగమైన వారు కేవలం రూ.703 తగ్గింపు ధరతో సిలిండర్‌ను అందుకుంటారు. ఇటీవలి కాలంలో గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం, దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధర చాలా కాలం పాటు స్థిరంగా ఉంది.

ఇది కూడా చదవండి..

టీఎస్ ఆర్టీసీ విద్యార్థులకు శుభవార్త.. ఇక నుండి మొత్తం ఆన్‌లైన్‌లోనే..

Share your comments

Subscribe Magazine