News

రైతులకు శుభవార్త .. రైతు భరోసా డబ్బులు అప్పుడే ..

Gokavarapu siva
Gokavarapu siva

రైతులను ఆదుకొని పంట సాగును ప్రోస్తహిందడానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పధకాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తాయి. ఈ వివిధ రకాల పథకాల వల్లా రైతులు ఆర్ధికంగా బలపడి పంటలను సాగు చేస్తున్నారు. దీనితో పాటు రైతులకు ఉచితంగా విత్తనాలను పంపిణి చేయడం మరియు పంటకు వాడే ఎరువులపై సబ్సిడీలను అందించడం ఈ విధంగా అనేక రకాలుగా ప్రభుత్వాలు రైతులకు అండగా నిలుస్తున్నాయి.

ఈ పథకాలలో ఒకటి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం కిసాన్ నిధి పథకం కింద ప్రతి సంవత్సరం రైతుల అకౌంట్లో 6000 వేల రూపాయలను వేస్తుంది. ఈ విధంగానే వివిధ రాష్ట్రాల్లో అనేక రకాల పథకాలతో ప్రభుత్వాలు రైతులకు ఆర్ధికంగా సహాయం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో రైతులకోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పధకాన్ని ప్రారంభించిన సంగతి మనకి ఎప్పుడో తెలిసిందే. ఈ రైతు భరోసా పథకంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి నేరుగా డబ్బులను ప్రతి సంవత్సరం వేస్తుంది.

వ్యవసాయ శాఖ కమీషనర్ అయిన హరికిరణ్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో రబి ఈ క్రాప్ మరియు ఈ కేవైసీలను ఈ నెల ఫిబ్రవరి 28 లోగా పూర్తి చేయాలనీ తెలిపారు. వేసవి కాలంలో సాగు చేసే పంటలకు ఈ క్రాప్ నమోదు చేసుకునే అవకాశాన్ని ఈ సంవత్సరం మర్చి మరియు ఏప్రిల్ నెలల్లో కల్పిస్తామని తెలిపారు.

ఇది కూడా చదవండి..

రైతన్నలు ఈ పథకం లో చెరితే .. ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్ పొందవచ్చు !

ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనేర్ హరికిరణ్ ఈ సంవత్సరం పీఎం రైతు భరోసా సహాయాన్ని రైతుల అకౌంట్లో ఈ 27న జమ చేయునునట్లు తెలిపారు. దీనితో పాటు రైతులకు మాండస్ తుఫాను వాళ్ళ జరిగిన పంట నష్టంకి రాయితీగా 76 కోట్ల రూపాయలను రైతుల అకౌంట్లోకి ఆ రోజునే వేయనున్నారు. రైతు భరోసా కేంద్రల ద్వారా రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. దీనితో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

రైతన్నలు ఈ పథకం లో చెరితే .. ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్ పొందవచ్చు !

Related Topics

raitu barosa

Share your comments

Subscribe Magazine