News

ఏపీ మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త..

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. మహిళా ఉద్యోగుల కొరకు ప్రత్యేకంగా చైల్డ్ కేర్ లీవ్స్ అనేవి ఉంటాయి. తమ పిల్లలను చూసుకోవడానికి మహిళా ఉద్యోగులు ఈ లీవ్స్ కి అప్లై చేసి సెలవులు తీసుకోవచ్చు. మహిళా ఉద్యోగులకు వారి సర్వీసు మొత్తానికి 180 రోజులు తీసుకోవచ్చు.

ప్రస్తుతం మహిళా ఉద్యోగులు ఈ చైల్డ్ కేర్ లీవ్స్ ను కేవలం వారి పిల్లలకు 18 సంవత్సరాలు నిండే వరకు మాత్రమే ఉపయోగించుకోవాలని షరతు ఉంది. కానీ దీనికి కొన్ని మార్పులు చేసింది ప్రభుత్వం. ఇప్పటి నుంచి మహిళా ఉద్యోగులు వారి సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ 180 రోజుల చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను పొందే అవకాశం కల్పించింది. దీని కొరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయాలని ప్రభత్వం అధికారులకు తెలిపింది.

ఉపాధ్యాయుల సమస్యలపై ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి వారికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. దీనిలో భాగంగా మహిళా ఉద్యోగుల సమస్యలలో ఒకటైన ఈ చైల్డ్‌ కేర్‌ లీవ్‌ సమస్యను ముఖ్యమంత్రికి తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమస్యపై సానుకూలంగా స్పందించారు. ఇప్పుడే ఉత్తర్వులు జారీ చేయమని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుండి రాగి జావ పంపిణీ..

అడగగానే ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరించినందుకు ఎంవీ రామచంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేసారు. దీనితోపాటు వారు ముఖ్యమంత్రిని ప్రైవేటు స్కూళ్ల రెన్యువల్‌ ఆఫ్‌ రికగ్నైజేషన్‌ను 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలకు పెంచాలని కోరారు. దేనిపై కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఆ పని కొరకు అధికారులను ఉత్తర్వులను జారీ చేయమని ఆదేశించారు.

ఇది కూడా చదవండి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుండి రాగి జావ పంపిణీ..

Share your comments

Subscribe Magazine