News

గుడ్ న్యూస్.. వారికి గౌరవవేతనం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

Gokavarapu siva
Gokavarapu siva

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఇందిరా క్రాంతి పథంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ లుగా పనిచేస్తున్న వ్యక్తులకు ఉత్తేజకరమైన వార్తలను అందించింది. ప్రభుత్వం వారి విలువైన సహకారాన్ని గుర్తించే ప్రయత్నంలో, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ల గౌరవ వేతనాన్ని గణనీయంగా పెంచడానికి నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం, తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న వీవోఏలకు ప్రభుత్వం రూ. 3,900 గౌరవ వేతనం చెల్లిస్తుంది. ఈ గౌరవ వేతనాన్ని రూ. 3,900 నుండి రూ. 5 వేలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీవోఏలకు అదనపు భత్యం నెలకు రూ.3,000 కలిపి మొత్తం నెలవారీ చెల్లింపుగా రూ.8,000 ప్రభుత్వం అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 17,000 మంది వీవోఏలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.

వీవోఏలు గత కొంతకాలం నుండి కూడా వారికి జీతాలు పెంచి, వారిని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. దీనితోపాటు వారికి 26 వేలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా ప్రభుత్వాన్ని కోరారు. 20 ఏళ్లుగా వీవోఏలుగా పనిచేస్తున్నప్పటికీ.. కేవలం రూ. 3,900 వేతనం చెల్లిస్తూ, వారితో అనేక రకాల పనులు అన్ని చేయిస్తున్నారనీ, శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని వీవోఏలు ఆరోపిస్తున్నారు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం తమ వేతనాల పెంపునకు శ్రీకారం చుట్టడం పట్ల విఓఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

అక్టోబర్‌ 1 నుండి సిమ్‌కార్డ్‌ కొత్త రూల్స్‌..పాటించకుంటే భారీ జరిమానా తప్పదు..

మారొకవైపు, రైతులకు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 17.15 లక్షల మంది రైతుల ఖాతలో రుణమాఫీ డబ్బులు చేరాయన్నారు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు, కొన్ని సాంకేతిక కారణాలవల్ల 1.6 లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ డబ్బులు అందలేదని వారికీ కూడా త్వరలో రుణమాఫీ డబ్బులను అందిస్తామని , సోమవారం రైతు రుణమాఫీపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో బ్యాంకర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో హరీశ్‌రావు తెలిపారు.

ఇది కూడా చదవండి..

అక్టోబర్‌ 1 నుండి సిమ్‌కార్డ్‌ కొత్త రూల్స్‌..పాటించకుంటే భారీ జరిమానా తప్పదు..

Share your comments

Subscribe Magazine