News

నెల చివరి లోగ 'గృహలక్ష్మి'పై ప్రకటన .. ఇళ్ళు కట్టుకునే వారికీ రూ . 3 లక్షలు

Srikanth B
Srikanth B
నెల చివరి లోగ 'గృహలక్ష్మి'పై ప్రకటన .. ఇళ్ళు కట్టుకునే వారికీ రూ . 3 లక్షలు
నెల చివరి లోగ 'గృహలక్ష్మి'పై ప్రకటన .. ఇళ్ళు కట్టుకునే వారికీ రూ . 3 లక్షలు

తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలైన ప్రజలు ఇళ్ళు నిర్మించుకోవాలనుకునే వారికీ రూ ..3 లక్షల ఆర్థిక సహాయం అందించేవిధంగా గృహలక్ష్మి పథకాన్ని తీసుకురావడానికి కసరత్తులు చేస్తుంది . ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఈమేరకు త్వరగా ఈ పథకం కు సంబందించిన విధివిధానాలను పూర్తి చేసి గ్రామస్థాయిలో లబ్దిదారులను గుర్తించాలని భావిస్తుంది .

గత రాష్ట్ర బడ్జెట్‌లో ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేల కోట్లు కేటాయించింది దీని ద్వారా గృహలక్ష్మి అనే కొత్త పథకాన్ని
ప్రారంభించనుంది , దీని ద్వారా స్వంతంగా భూమి కల్గి ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు 3 లక్షల ఆర్థిక సాయం అందించనుంది .

గ్రామీణ ప్రాంతాల్లో 100 గజాల నుంచి 250 గజాలు, పట్టణాల్లో 80 గజాలు ఉంటే లబ్ధిదారులు అర్హులు అని అధికారులు ఖరారు చేశారు. స్కీమ్ ను మహిళ పేరు మీదే ఇవ్వాలన్న ఉద్దేశంతో గృహలక్ష్మి అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. అధికారులు ఖరారు చేసిన గైడ్ లైన్స్ లో సవరణలతో ఫైనల్ చేసే బాధ్య తలను మంత్రి హరీశ్ రావుకు సీఎం అప్పగించారు. పంచాయతీ రాజ్, మున్సిపల్, హౌసింగ్ మంత్రుల తో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తారని అనుకు న్నప్పటికీ, మరింత ఆలస్యం అవతుందన్న ఉద్దేశంతో స్కీంను సీఎం ఫైనల్ చేసినట్లు తెలిసింది.

గుడ్ న్యూస్: కేంద్రం నిర్ణయంతో సామాన్యులకు భారీ ఊరట.. తగ్గనున్న ధరలు

ఇల్లు కట్టుకునేందుకు ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షల గ్రాంట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్కో విడతకు రూ.లక్ష చొప్పున మూడు విడతల్లో రూ.3 లక్షలు జమ చేస్తామని ప్రకటించింది. ఒక్కో నియోజకవర్గం నుంచి 3 వేల మందిని ఎంపిక చేయనున్నారు.

గుడ్ న్యూస్: కేంద్రం నిర్ణయంతో సామాన్యులకు భారీ ఊరట.. తగ్గనున్న ధరలు

Related Topics

gruhalakshimi

Share your comments

Subscribe Magazine