News

తెలుగు రాష్ట్రాలకు హిట్ అలెర్ట్ .. అవసరం అయితేనే బయటకు రండి!

Srikanth B
Srikanth B
heat wave alert
heat wave alert

 

భానుడి భగ భగ లతో రెండు రాష్ట్రాలు వేడిక్కి పోతున్నాయి గత కొద్దీ రోజులనుంచి ప్రజలు ఉష్ణోగ్రతలు , ఉక్కపోతలతో జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు . కొన్ని జిల్లాలో అయితే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటేశాయి అదే తరుణంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రెండు రాష్ట్రాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు రానున్న మూడు రోజులలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగే అవకాశం వున్నదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది .

తెలంగాణలో ఈ వారం లో గరిష్టంగా 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి హైదరాబాద్ పరిసర జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 41 డిగ్రీల దాకా నమోదు కాగా వరంగల్‌ 43, నల్లగొండ, ఖమ్మం 44, భూపాలపల్లిలో 45 డిగ్రీలు, నల్గొండ నిడమనూరులో 45 డిగ్రీలు, ములుగు తాడ్వాయి 44.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయి ఇటువంటి తరుణంలో రాష్ట్ర వాతావరణ శాఖ రానున్న 3 రోజులపాటు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇది కూడా చదవండి .

యూఐడీఏఐ కొత్త ఆప్షన్ తో సైబర్ నేరగాళ్లకు చెక్.. ఇలా చేస్తే మీ డబ్బులు సేఫ్

ఆంధ్ర ప్రదేశ్లో ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆంధ్రలో సాధారణం కంటే 4-6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రత దాదాపుగా 46 డిగ్రీలు దాటిపోయింది. ప్రకాశం 46, ఏలూరు, విజయవాడలో 47, గుంటూరులలో 48 డిగ్రీలు, రాజమండ్రిలో అత్యధికంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు సమాచారం .


మరోవైపు తెలుగు రాష్ట్రాలలో 20 మందికి పైగా వడదెబ్బకు గురికాగా తెలంగాణాలో ముగ్గురు , ఆంధ్రాలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం .

ఇది కూడా చదవండి .

యూఐడీఏఐ కొత్త ఆప్షన్ తో సైబర్ నేరగాళ్లకు చెక్.. ఇలా చేస్తే మీ డబ్బులు సేఫ్

 

 

Related Topics

heatwave alert

Share your comments

Subscribe Magazine