News

ఆంధ్రప్రదేశ్ లోని 14 జిల్లాలకు భారీ వర్ష సూచనా !

Srikanth B
Srikanth B
ఆంధ్రప్రదేశ్ లోని 14 జిల్లాలకు భారీ వర్ష సూచనా !
ఆంధ్రప్రదేశ్ లోని 14 జిల్లాలకు భారీ వర్ష సూచనా !

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రానున్న 24 గంటలలో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా పలు చోట్ల మోస్తరు వార్షపాతం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ విభాగం ఇచ్చిన సమాచారం మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. దీని ప్రభావం వచ్చే 48 గంటల వరకు వరకూ ఉండొచ్చు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా, మధ్య కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి సూచించింది .

వచ్చే 24 గంటలలో అన్నమయ్య రాయచోటి, కడప, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని . బాపట్ల, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షం పడుతుందని సూచించింది.

తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..

పొలం పనులకు వెళ్లే రైతులు వర్షం తాలూకు జాగ్రత్తలను పాటించాలని సూచించింది. ఈ వర్షాల తీవ్రత 48 గంటల వరకూ కొనసాగే అవకాశాలు లేకపోలేదు. ఉపరితల ఆవర్తనం బలపడటానికి అనుకూల వాతావరణం ఉన్నందున రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలుగు రాష్ట్రాలకు మరో అల్పపీడనం.. భారీ నుంచి అతి భారీ వర్షాలు..

Related Topics

andhrapradesh rains

Share your comments

Subscribe Magazine